CM Jagan Started two Police Stations : రెండు పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్
సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) వైఎస్ఆర్ జిల్లాలో(YSR District) తన రెండు రోజుల పర్యటన లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ లో రూ. 1.75 కోట్లతో నిర్మించిన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్(Police station), రూ.2.75 కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు.

CM Jagan Started two Police Stations
సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) వైఎస్ఆర్ జిల్లాలో(YSR District) తన రెండు రోజుల పర్యటన లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ లో రూ. 1.75 కోట్లతో నిర్మించిన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్(Police station), రూ.2.75 కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. అనంతరం అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనారిటీ శాఖ మంత్రి ఎస్. బి. అంజాద్ బాషా(S. B. Amjad Basha), జిల్లా ఇంచార్జి మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, డిఐజి శెంథిల్ కుమార్, ఏస్పీ శిద్దార్థ్ కౌశల్, జమ్మలమడుగు ఎమ్యెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
