ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకుంటారు. కనకదుర్గ వారధి వద్ద నీటిపారుదల శాఖ రిటైనింగ్ వాల్ తో పాటు రివర్ ఫ్రంట్ డెవలెప్‌మెంట్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి వాటిని లబ్దిదారులకు అందచేయనున్నారు. అక్కడ రిటైనింగ్ వాల్‌తో పాటు రివర్ ఫ్రంట్ డెవలెప్‌మెంట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం పేదలకు పట్టాలను అందచేయనున్నారు. ఆ తర్వాత ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. సీఎం జగన్ పర్యటన కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని.. ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

Updated On 11 March 2024 8:59 PM GMT
Yagnik

Yagnik

Next Story