విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్లతో(Education Vice Chancellors) సీఎం జగన్(CM Jagan) గురువారం కీలక సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో సీఎం మాట్లాడుతూ.. విద్యారంగంలో(Education Development) ప్ర‌స్తుతం జరుగుతున్న మార్పులను గమనిస్తే..

విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్లతో(Universities Vice Chancellors) సీఎం జగన్(CM Jagan) గురువారం కీలక సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో సీఎం మాట్లాడుతూ.. విద్యారంగంలో(Education Development) ప్ర‌స్తుతం జరుగుతున్న మార్పులను గమనిస్తే.. మనం ఒక స్థాయిలో ఉంటే... లక్ష్యం ఇంకో స్థాయిలో ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలంటే.. ఏం చేయాలన్నదానిపై ఆలోచనలను పంచుకోవడానికి మీ అందర్నీ ఒక చోటకు పిలిచాను. ఉన్నత విద్యా రంగంలో వైస్‌ఛాన్సలర్లది కీలక పాత్ర. అందుకే మిమ్మల్ని కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నట్లు వెల్ల‌డించారు.

టెక్నాలజీ(Technology) పరంగా చూస్తే.. మొదటి రివల్యూషన్‌ 1784లో స్టీమ్‌తో రైలు ఇంజన్‌(Steam Engine Rail) రూపంలో చూశాం. తర్వాత 100 ఏళ్ల తర్వాత విద్యుత్‌(Electric Vehicles) రూపంలో మరొక రివల్యూన్‌ చూశాం. మూడోది 1960–70 ప్రాంతంలో కంప్యూటర్లు(computers), ఐటీ రంగం రూపేణా మరొక విప్లవం చూశాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(Artificial Intelligence) రూపంలో నాలుగో విప్లవం దిశగా అడుగులు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో విద్యావిధానాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తిగా మార్చబోతోంది. ఈ అడుగులో మనం వెనుకబడితే.. కేవలం అనుసరించే వాళ్లగానే మనం మిగులుతాం. సరైన సమయంలో తగిన విధంగా అడుగులు వేయగలిగితే.. మనం ఈరంగాల్లో నాయకులం అవుతాం. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. దీన్ని వినియోగించుకుని, సామర్ధ్యాన్ని పెంచుకునే వర్గం ఒకరు అయితే, ఏఐని క్రియేట్‌ చేసేవారు.. మరొక వర్గంగా తయారవుతారని అన్నారు.

గతంలో స్టీం ఇంజిన్, ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్‌ విప్లవాల్లో మనం వెనకడుగులోనే ఉన్నాం. మనం ఏదీ క్రియేట్‌ చేసే పరిస్థితిలో లేం. అందుకనే ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో మనం క్రియేటర్లుగా మారడం అన్నది చాలా ముఖ్యమైనది. ఈ రంగంలో మనం లీడర్లుగా తయారు కావడం చాలా ముఖ్యం. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌లో మనం క్రియేటర్లుగా తయారు కావాలని సూచించారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని ఒకవైపు మన విద్యావిధానంలోకి తీసుకువచ్చి.. విద్యార్థులకు బోధన, నేర్చుకునే సమర్థతను పెంచుకోవడంలో ఎలా వాడుకోవాలి? అన్న కార్యక్రమం చేస్తూనే.. రెండోవైపున ఏఐ క్రియట్‌ చేసే స్కిల్స్, టాలెంట్‌ను కూడా మన పిల్లల్లోకి తీసుకుని రావాలి. ఇది కూడా కరిక్యులమ్‌లో భాగం కావాల్సిన అవసరముందని అన్నారు.

మొన్ననే జర్మన్‌(German) కాన్సులేట్‌ జనరల్‌(Consulate General) నన్ను కలిశారు. జర్మనీ లాంటి దేశంలో నైపుణ్యం ఉన్న మానవవనరుల కొరత ఉందని చెప్పారు. పాశ్చాత్య ప్రపంచం అంతా డెమొగ్రఫిక్‌ ఇన్‌బ్యాలెన్స్‌ ఎదుర్కొంటోంది. మనదేశంలో కాని, మన రాష్ట్రంలోకాని సుమారు 70శాతం మంది పనిచేసే వయస్సులో ఉన్నారు. వీరికి సరైన నాలెడ్జ్, స్కిల్స్‌ ఇవ్వలేకపోతే మనం ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా ఉండలేం. ఇది వాస్తవం. అందుకే విద్యారంగంలో మార్పులకు మనం శ్రీకారం చుట్టాలి. మార్పులకు శ్రీకారం చుడితే.. మనం అనుకున్నట్టు ఫలితాలు ఉంటాయి, విద్యారంగంలో ఇంకా మెరుగ్గా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై ఆలోచనలు చేయాలని సూచించారు.

నలుగురితో నేను మాట్లాడి.. నాకు అనిపించిన ఆలోచనలన్నింటినీ కూడా వీసీల ముందు ఉంచుతున్నాను. ఈ ఆలోచనలు కార్యాచరణలోకి రావాలి, వీటికి రూపకల్పన జరగాలి. ఇందులో మీ పాత్ర గరిష్టంగా ఉండాలి. ఈ రోజు మనం మొట్టమొదటి అడుగు వేస్తున్నాం. ఈ తొలి అడుగు మన ఆలోచనలను చైతన్యం చేయడం ద్వారా విద్యారంగాన్ని ఇప్పుడున్న స్థాయి నుంచి మెరుగైన స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రపంచస్థాయిలో మన పిల్లలను అనేక రంగాల్లో లీడర్లుగా చూడాలనుకుంటున్నాం. ఇవాళ మనం చదివిస్తున్న, చదువుకుంటున్న చదువులు నిజంగానే.. ప్రపంచస్థాయిలో నాయకులుగా నిలబడగలిగే స్థాయిలో ఉన్నాయా? లేకపోతే.. ఎలా చేయాలన్న దానిపై ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ స‌మావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టీ కృష్ణబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్‌, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి విజయ్‌కుమార్‌రెడ్డి, పలువురు విశ్వవిద్యాలయాల వీసీలు హాజరయ్యారు.

Updated On 14 July 2023 12:16 AM GMT
Ehatv

Ehatv

Next Story