CM Jagan : తెలంగాణ నుంచి ఆ డబ్బు ఇప్పించండి.. కేంద్రమంత్రికి సీఎం జగన్ విజ్ఞప్తి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విద్యుత్ శాఖమంత్రి ఆర్‌కే సింగ్‌తో సీఎం వైయస్.జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అలు అంశాలపై సీఎం చర్చించారు.
పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాలపై ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో ముఖ్యమంత్రి చర్చించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman), కేంద్ర విద్యుత్ శాఖమంత్రి ఆర్‌కే సింగ్(RK Singh)తో సీఎం వైయస్.జగన్(YS Jagan) భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అలు అంశాలపై సీఎం చర్చించారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project), రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాలపై ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో ముఖ్యమంత్రి చర్చించారు. సత్వరం ప్రాజెక్టును పూర్తిచేయాల్సి అవసరం ఉందని, వీలైనంత త్వరగా ప్రాజెక్టు ఫలితాలను అందించేందుకు సహకరించాలని సీఎం కోరారు. ప్రాజెక్టు పూర్తి నిర్మాణం వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉందని సీఎం తెలిపారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 55,548.87 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని సీఎం గుర్తుచేశారు. ఇందుకు ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.
పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడహాక్‌గా డబ్బు విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన గతంలో పలుమార్లుచేసిన విజ్క్షప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు ఆమోదం లభించడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చుచేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్ చేయాలని కూడా సీఎం విజ్ఞప్తిచేశారు.
తెలంగాణ రాష్ట్రం(Telangana State) చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు(Electricity dues) సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. రూ.7,359 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉందన్నారు. 2014 జూన్ నుంచి 2017 జూన్‌వరకూ సరఫరా చేసిన విద్యుత్ ఛార్జీలను ఇప్పటికీ చెల్లించలేదని.. 9 ఏళ్లుగా ఈ సమస్య పెండింగులో ఉందని, ఏపీ జెన్‌కోకు, డిస్కంలకు ఇది తీవ్ర గుదిబండగా మారిందని.. దీంతో వివిధ సంస్థలకు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఏపీ విద్యుత్ సంస్థలకు ఏర్పడిందని.. వెంటనే ఈ డబ్బు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. డబ్బు ఇప్పించాలంటూ ఏపీ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేయగా.. 30 రోజుల్లోగా ఏపీకి బకాయిలు చెల్లించాలంటూ ఆగస్టు 29, 2022న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం హైకోర్టును ఆశ్రయించిందని, దీంతో ఈ అంశంలో కోర్టు వ్యవహారంలో పడిపోయిందని సీఎం వెల్లడించారు. ఏపీ విద్యుత్ సంస్థలకు ఆ డబ్బు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.