MLA Jogi Ramesh : మంత్రి జోగి రమేష్‌కు మరో కీలక బాధ్యత అప్పగించిన సీఎం.!
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) మరో కీలక బాధ్యత అప్పగించారు. ఆంధ్రప్రదేశ్(andhra pradesh) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) మరో కీలక బాధ్యత అప్పగించారు. ఆంధ్రప్రదేశ్(andhra pradesh) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్(Dr. B R Ambedkar) 125 అడుగుల భారీ విగ్రహ నిర్మాణ కమిటీలో సభ్యుడిగా చోటు కల్పించింది. ఈ మేరకు సోమవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం జీవో అర్టీ నెంబర్ 140 విడుదల చేసింది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్ మైదాన్ లో 19 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ మెమోరియల్ పార్కు, 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ నిర్మాణ పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి.
ఇదిలావుంటే.. మంత్రి జోగి రమేష్ ఇప్పటికే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, ప్రజా పద్దుల కమిటీ సభ్యుడుగా, అధికార ప్రతినిధిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా సీఎం మరో బాధ్యత అప్పగించడంతో మంత్రి జోగి రమేష్ పనితీరుకు ఇది గీటురాయి అంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఈ పనులు శరవేగంగా సాగటానికి, తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు చెందిన తాను.. మా అందరి ఆరాధ్య దైవమైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీలో సభ్యుడిగా చోటు దక్కటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తనమీద అచంచల విశ్వాసముంచి తనకు అప్పజెప్పిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి, నిర్దిష్ట సమయంలోపు విగ్రహ ప్రతిష్ఠ పనులన్నీ పూర్తి చేసి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.