శ్రీకాకుళం పర్యటన(Srikakulam Tour)లో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(CM Jgan) కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా వచ్చే సెప్టెంబర్‌ నుంచి విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామని చెప్పారు. సెప్టెంబర్‌ నుంచి తాను విశాఖలోనే ఉంటానని తెలిపారు. ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేయాలన్నదే తన తపన అని అన్నారు. ' మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. మిగతావాళ్లంతా ఏకం అవుతున్నారు. అంతా ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నారు.

శ్రీకాకుళం పర్యటన(Srikakulam Tour)లో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(CM Jgan) కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా వచ్చే సెప్టెంబర్‌ నుంచి విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామని చెప్పారు. సెప్టెంబర్‌ నుంచి తాను విశాఖలోనే ఉంటానని తెలిపారు. ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేయాలన్నదే తన తపన అని అన్నారు. ' మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. మిగతావాళ్లంతా ఏకం అవుతున్నారు. అంతా ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నారు. ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు. నా ఆత్మవిశ్వాసం మీరు ' అని ప్రజలనుద్దేశించి జగన్‌ వ్యాఖ్యానించారు.

శ్రీకాకుళం పర్యటనలో సీఎం జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మూల పేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు(Mulapeta Greenfield Port) నిర్మాణానికి, నౌపడ దగ్గర పోర్టు నిర్వాసి కాలనీకి, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌కి, హిర మండలం వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళం ముఖచిత్రాన్ని మార్చేస్తాయన్నారు. గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేశారని, ఇక నుంచి మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలవనుందని చెప్పారు. భవిష్యత్తులో మూలపేట, విష్ణుచక్రం మరో ముంబాయి, మద్రాస్‌లా మారతాయని జగన్‌ తెలిపారు. పోర్టు వస్తే పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయని, అప్పుడు లక్షల సంఖ్యలో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు.

Updated On 19 April 2023 1:54 AM GMT
Ehatv

Ehatv

Next Story