ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన ఢిల్లీ బయల్దేరుతారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జ‌గ‌న్‌ రేపు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

ఏపీ సీఎం జగన్(CM Jagan) నేడు ఢిల్లీ పర్యటన(Delhi Tour)కు వెళ్ల‌నున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన ఢిల్లీ బయల్దేరుతారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జ‌గ‌న్‌ రేపు ప్రధాని మోదీ(PM Modi)తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah)తో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. మూడు రోజుల పాటు జగన్ ఢిల్లీలో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు(Parliament monsoon sessions) జరగనున్నాయి. ఈ స‌మావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ నేప‌థ్యంలో కొన్ని అంశాల్లో వైసీపీ మద్దతును ప్ర‌ధాని మోదీ కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు(Uniform Civil Code) పాస్ కావాలంటే రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ(YSRCP) మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఈ బిల్లులకు సహకరించాల్సిందిగా జగన్ ను మోదీ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated On 3 July 2023 10:55 PM GMT
Yagnik

Yagnik

Next Story