మంగళగిరిలో వైసీపీ 'మేం సిద్ధం-మా బూత్ సిద్ధం' పేరిట నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ

మంగళగిరిలో వైసీపీ(YCP) 'మేం సిద్ధం-మా బూత్ సిద్ధం' పేరిట నిర్వహించిన ఈ సమావేశంలో సీఎం జగన్(CM Jagan) ప్రసంగించారు. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే 45 రోజులు మనకు అత్యంత కీలకం అని పేర్కొన్నారు. వైసీపీ టికెట్లు దాదాపు ఖరారయ్యాయని వెల్లడించారు. ప్రజలకు నేను చేయాల్సింద‌ల్లా చేశాను.. ఇక మీ వంతు వ‌చ్చిందంటూ వైసీపీ శ్రేణుల‌ను అల‌ర్ట్ చేశారు. వైసీపీ గెలవకపోతే సంక్షేమం ఆగిపోతుందని ప్రజలకు చెప్పండి అని స్పష్టం చేశారు. ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం.. ఈ క్లాస్ వార్ లో జగన్ గెలిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. జగన్ గెలిస్తేనే సంక్షేమం కొనసాగుతుంది అని పేర్కొన్నారు.

మనం చంద్రబాబు(Chandrababu)లాగా కాదు.. చేప్పిందే చేస్తాం.. చేసేదే చెబుతాం. చంద్రబాబు అడ్డగోలు హామీలు ఇవ్వడంలో దిట్ట. గతంలో చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలన్నీ నాకు గుర్తే.. ఆచరణ సాధ్యం కాని హామీలను కూడా మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను వంచించాడు. వారి పార్టీ వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టోను కూడా తీసేశాడు" అంటూ సీఎం జగన్ విమర్శించారు.

ప్రజలకు ఎంతో మంచి చేశాం.. ఈ అంశాల‌ను ప్ర‌తి ఇంటికి వెళ్లి చెప్పి.. ఓట్లు అడ‌గాలని సూచించారు. ప్ర‌తీ ఒక్క‌రూ రెట్టించిన ఉత్సాహంలో జ‌నాల్లోకి వెళ్లి.. మంచి చేశాం.. మంచి చేసి ఓటు అడుగుతున్నాం అన్న గొప్ప సంతృప్తితో వెళ్లండ‌ని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుంచి వైసీపీ బలంగా ఉంది. చేసిన మంచి పనులే మనకు అండ. గత ఎన్నిక‌ల్లో 151 అసెంబీ సీట్లు, 22 ఎంపీ సీట్లు వ‌చ్చాయి.. ఈ సారి మాత్రం 175కి 175 అసెంబ్లీ.. 25కి 25 లోక్‌స‌భ స్థానాలు రావాల్సిందేన‌ని టార్గెట్ ఫిక్స్ చేశారు.

Updated On 27 Feb 2024 8:02 PM GMT
Yagnik

Yagnik

Next Story