ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్(YS Jagan) సోమ‌వారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని విధ్యాధరపురం బస్ డిపో వ‌ద్ద గ‌ల వీఎంసీ స్టేడియంలో(VMC stadium) ముస్లిం సోదరులకు ఇఫ్తార్(Iftar) విందును ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్(YS Jagan) సోమ‌వారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని విధ్యాధరపురం బస్ డిపో వ‌ద్ద గ‌ల వీఎంసీ స్టేడియంలో(VMC stadium) ముస్లిం సోదరులకు ఇఫ్తార్(Iftar) విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ప్రజల సౌకర్యార్దం ట్రాఫిక్‌ను(traffic) మళ్ళించ‌నున్న‌ట్లు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ మేర‌కు ప్రజలందరు సహకరించాల‌ని ప్ర‌క‌ట‌న‌లో కోరారు. ఇక సీఎం జ‌గ‌న్‌ సాయంత్రం 5. 30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5. 45 గంటలకు విద్యాధరపురం మినీ స్టేడియంకు చేరుకుంటారు. 5. 45 – 7. 15 గంటల వరకు ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. ముస్లిం మత పెద్దలతో కలసి సామూహిక ప్రార్దనల్లో జగన్ పాల్గోంటారు. ముస్లిం పెద్దలను సత్కరిస్తారు. ఇదే వేదిక పై ముఖ్యమంత్రి జగన్ ను కూడా ముస్లిం పెద్దలు మర్యాద పూర్వకంగా సన్మానించనున్నారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ట్రాఫిక్ మళ్ళింపులు :

1. జోజినగర్ జంక్షన్ నుండి సితార సెంటర్ వరకు, సితార సెంటర్ నుండి జోజినగర్ జంక్షన్ వరకు ఎటువంటి వాహనములు అనుమతించ బడవు.

2. గొల్లపూడి వై జంక్షన్ వైపు నుండి సితార, చిట్టినగర్ వైపుకు వచ్చు అన్ని వాహనములు ఎట్ కిన్సన్ స్కూల్ రోడ్డు, కబేళ వైపుకు మళ్ళించడం జరుగుతుంది.

3. చిట్టినగర్ వైపు నుండి గొల్లపూడి, హెచ్.బి.కాలనీ, ఊర్మిళానగర్ వెళ్ళు వాహనములను సితార జంక్షన్ వద్ద కుమ్మరిపాలెం వైపుకు లేదా కబేళ వైపుకు మళ్ళించడం జరుగుతుంది.

ఆర్టీసీ సిటీ బస్సు మళ్ళింపులు :

1. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు వైఎస్ఆర్‌ కాలనీ, మిల్క్ ప్రాజెక్టు, కబేళా నుండి కాళేశ్వరరావు మార్కెట్ వైపుకు వెళ్ళు బస్సులు.. కబేళా-ఊర్మిలా నగర్-జోజినగర్, చర్చి జంక్షన్ - స్వాతి జంక్షన్- కనక దుర్గా ఫ్లైఓవర్ సర్వీసు రోడ్డు –కుమ్మరిపాలెం –ఘాట్ రోడ్డు కెనాల్ రోడ్డు మీదుగా వెళ్ళవలెను.

ఆహ్వానితులకు ప్రత్యేక సూచనలు :

పాస్ కలిగిన ఆహ్వానితుల వాహనా పార్కింగ్ :

1. ఏ1 పాస్ కలిగిన వారు వీఎంసీ స్టేడియం వరకు వచ్చి విధ్యాధరపురం ఆర్టీసీ డిపోలో వాహనాలు పార్కింగ్ చేయవలెను.

2. ఇఫ్తార్ విందుకు వచ్చు ముస్లిం సోదరులు సితారా సెంటర్/భగవతి కాటా వరకు వచ్చి వీఎంసీ స్టేడియం ఎదురుగా వున్న నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలలో వారి కార్లు, ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేయాలి.

3. ఇఫ్తార్ విందుకు వచ్చు ముస్లిం సోదరులు సితారా సెంటర్ వచ్చి అక్కడ వున్న నిర్దేశించిన పార్కింగ్ కొరకు కేటాయించిన ప్రదేశాల‌లోలో వారి కార్లు, ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయాలి.

4. పాసులు కలిగిన ఆహ్వానితులు సాయంత్రం 5.30 లోపు స్టేడియం వద్దకు చేరుకోవాలి.

ఇఫ్తార్ విందుకు వచ్చే ఆహ్వానితులు వారి వాహనాలను విధ్యాధరపురం వీఎంసీ స్టేడియం పరిసర ప్రాంతాలలో పార్క్ చేసి ఇతర ఆహ్వానితుల రాక పోకలకు ఇబ్బంది కలిగించ‌వ‌ద్ద‌ని పోలీసులు ప్ర‌క‌ట‌న‌లో సూచించారు.

Updated On 17 April 2023 3:28 AM GMT
Ehatv

Ehatv

Next Story