కృష్ణాజలాల అంశంపై ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తంచేశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని సీఎం కోరారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా(Amit Shah)తో సీఎం జగన్‌(CM Jagan) సమావేశమ‌య్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు.

1. కృష్ణా జలాల(Krishna Water) అంశంపై ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తంచేశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని సీఎం కోరారు.

2. KWDT-II యొక్క నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court)లో 5 SLPలు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయని సీఎం హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇదే అంశంపై రెండు సార్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామ‌ని వివరించారు. 17.08.2021న, తర్వాత 25-06-2022న తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు.

3. KWDT-IIకి విధివిధానాలు (ToR) జారీకి 4.10.2023న కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని సీఎం అభ్యంతరం వ్యక్తంచేశారు. విధివిధానాలను బేసిన్‌లోని కర్ణాటక, మహారాష్ట్రలకు కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పరిమితం చేయడం అశాస్త్రీయమన్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని.. తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులను ఆదేశించవలసిందిగా సీఎం విజ్ఞప్తిచేశారు.

4. పోలవరం ప్రాజెక్టు(Polavaram Priject)కు నిధుల విడుదలపై చర్చించారు. ప్రాజెక్టు పూర్తి నిర్మాణం వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉందని.. దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని అభ్యర్థించారు ముఖ్యమంత్రి. 2017-18 ధరల సూచీ ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు వ్యయం 55,548.87 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని సీఎం గుర్తుచేశారు.

5. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు డబ్బు విడుదలచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన గతంలో పలుమార్లుచేసిన విజ్క్షప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు ఆమోదం లభించిందని, అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామన్న సీఎం.. లైడార్‌ సర్వేప్రకారం.. అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని.. పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని ఆ మేరకు నిధులు విడుదలచేయాలని సీఎం అభ్యర్థించారు.

6. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి ఖర్చుచేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్‌ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Updated On 6 Oct 2023 9:14 PM GMT
Yagnik

Yagnik

Next Story