తూర్పు గోదావ‌రి జిల్లా నిడదవోలు(Nidadavolu) సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు(Chandrababu) - పవన్‌లపై(Pawan kalyan)నిప్పులు చెరిగారు. 45 ఏళ్ల నుంచే బాబు దోపిడీనే రాజకీయంగా మార్చుకున్నార‌ని ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో టేపుల్లో బ్లాక్ మనీ పంచుతూ అడ్డంగా దొరికారని. సాక్ష్యాదారాలతో దొరికినా బుకాయిస్తున్నారని విమ‌ర్శించారు.

తూర్పు గోదావ‌రి జిల్లా నిడదవోలు(Nidadavolu) సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు(Chandrababu) - పవన్‌లపై(Pawan kalyan)నిప్పులు చెరిగారు. 45 ఏళ్ల నుంచే బాబు దోపిడీనే రాజకీయంగా మార్చుకున్నార‌ని ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో టేపుల్లో బ్లాక్ మనీ పంచుతూ అడ్డంగా దొరికారని. సాక్ష్యాదారాలతో దొరికినా బుకాయిస్తున్నారని విమ‌ర్శించారు. ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా.. అన్నవాడు ప్రశ్నించడు.. ఎల్లో మీడియాలో నిజాలు చూపించరు.. ఎల్లో మీడియా చంద్రబాబు అవినీతిపై మాట్లాడదు.. నిస్సిగ్గుగా వీరంతా చంద్రబాబుకు సపోర్టు చేస్తున్నారు. బాబు దోపిడీలో వీరంతా వాటాదారులేన‌న్నారు.

లేని కంపెనీ ఉన్నట్లు ఫేక్ అగ్రిమెంట్ సృష్టించారని.. స్కిల్ స్కామ్(Skill Development Scam) సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేన‌న్నారు. ఫేక్ అగ్రిమెంట్‌తో ప్రభుత్వ ఖజానాను దోచేశారని మండిప‌డ్డారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారని పైర్ అయ్యారు. సీమెన్స్‌ కంపెనీ తమకు సంబంధం లేదని చెప్పిందని.. ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిందని.. ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారని తెలిపారు. డొల్ల షూట్ కేసు కంపెనీలకు నిధులు మళ్లించినట్లు ఈడీ తెలిపిందన్నారు.

ఈడీ అరెస్ట్ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారని మండిప‌డ్డారు. కోర్టు రిమాండ్‌కు పంపితే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడని ప‌వ‌న్‌పై మండిప‌డ్డారు. రూ.371 కోట్ల ప్రజాధనం ఎక్కడికిపోయింది.. ప్రజాధనం దోచుకున్న బాబును కాకుంటే ఎవర్నీ అరెస్ట్ చేయాలి..? అని ప్ర‌శ్నించారు. వాటాలు పంచుతారు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించరు అన్నారు. లంచాలు తీసుకుంటే తప్పేంటనీ చెత్త పలుకులు రాసేది ఒకడు.. ములాఖత్‌లో మిలాఖత్‌లు చేసుకుని పొత్తు పెట్టుకునేది ఒకడు అంటూ ఎల్లో మీడియా, ప‌వ‌న్‌పై ప‌రోక్ష విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప్రజలంతా ఆలోచన చేయాలని అన్నారు. మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగిందా..? లేదా..? చూడండి. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు అండగా నిలబడండి. మీ అందరీ ఆశీస్సులతో రానున్న రోజుల్లో మంచి పాలన అందిస్తాన‌ని స‌భికుల‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.

Updated On 16 Sep 2023 4:54 AM GMT
Ehatv

Ehatv

Next Story