దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్‌లో ఉన్నా.. ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడేళ్లకు మారిపోతుంటారని
సీఎం జగన్(CM Jagan) వ్యాఖ్యానించారు. కాకినాడ(Kakinada) జిల్లా సామర్లకోటలో జగన్న కాలనీలో ఇళ్లను ప్రారంభించిన సీఎం జగన్ ఆ త‌ర్వాత బహిరంగ సభలో మాట్లాడుతూ ప‌వ‌న్‌పై(Pawan kalyan) విరుచుకుప‌డ్డారు. 'ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్..

దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్‌లో ఉన్నా.. ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడేళ్లకు మారిపోతుంటారని
సీఎం జగన్(CM Jagan) వ్యాఖ్యానించారు. కాకినాడ(Kakinada) జిల్లా సామర్లకోటలో జగన్న కాలనీలో ఇళ్లను ప్రారంభించిన సీఎం జగన్ ఆ త‌ర్వాత బహిరంగ సభలో మాట్లాడుతూ ప‌వ‌న్‌పై(Pawan kalyan) విరుచుకుప‌డ్డారు. 'ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్.. మరి తర్వాత ఎక్కడికి పోతాడో? ఆడవాళ్లు, పెళ్లిళ్ల(Marriage) వ్యవస్థపై ఆయనకు ఉన్న గౌరవం ఏంటో ప్రజలు ఆలోచించాల‌ని అన్నారు. నాయకులమైన మనమే భార్యలను ఇలా మారిస్తే ఎలా? అని ప్ర‌శ్నించారు. వాడుకోవడం, వదిలేయడంలాగానే నియోజకవర్గాలనూ అలాగే భావిస్తాడని ప‌వ‌న్‌పై CM జ‌గ‌న్ మండిప‌డ్డారు.

సరుకులు అమ్ముకునే వారిని చూశాం కానీ.. అభిమానుల ఓట్లను అమ్ముకుంటున్న వ్యక్తి పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు సినిమా షూటింగ్‌ల మధ్య విరామాల సమయంలో అప్పుడప్పుడు కనిపించడం పవన్‌ వంటి వ్యక్తులకే చెందుతుందన్నారు. విలువలు లేని వ్యక్తికి ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. ఇక చంద్రబాబు(Chandrababu) మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారనీ.. రాష్ట్రంలో ఎవరికీ ఇంటి జాగా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు సొంతిల్లు పక్కరాష్ట్రంలో ఉంటే.. ఇక్కడ ఏం చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో దత్తపుత్రుడికి, చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పాలని ప్ర‌జ‌ల‌ను కోరారు.

రెండేళ్లోనే పేదల సొంతింటి కల నెరవేర్చామని సీఎం జగన్ చెప్పారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామని చెప్పారు. ఏపీ వ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని సీఎం జగన్ ప్రకటించారు.

Updated On 12 Oct 2023 3:46 AM GMT
Ehatv

Ehatv

Next Story