CM Jagan : సీఎం జగన్ సెటైర్లు షర్మిల మీదనేనా ..?
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించారు. ఉరవకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా నిధుల్ని విడుదల చేశారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అనంతపురం(Ananthapuram) జిల్లా ఉరవకొండ(Uravakonda)లో పర్యటించారు. ఉరవకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా(YSR Asara) నిధుల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ ప్రతిక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు(Chandrababu)కు పక్క పార్టీల్లో స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని.. వారంతా జాకీలు పెట్టి లేపడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. తనకు మాత్రం ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు(Star campaigners) అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉండే దత్తపుత్రుడు చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ అని చెప్పారు. చంద్రబాబు వదిన కూడా ఆయనకు స్టార్ క్యాంపెయినరేనన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి తాజాగా చంద్రబాబు అభిమాన సంఘం వాళ్లు చేరారని పరోక్షంగా షర్మిల(Sharmila)పై విమర్శలు చేశారు.
దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా మహిళల కోసం.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమం పూర్తి చేయబోతున్నామని అన్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళల ఖాతాల్లోకి రూ. 31 వేల కోట్లు బదిలీ చేశామని తెలిపారు. 56 నెలల్లో మహిళా సాధికారత కోసం అనేక పథకాలు చేపట్టామని, వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళల ఖాతాల్లోకి రూ. 14,129 కోట్లు బదిలీ చేశామన్నారు. సున్నా వడ్డీ ద్వారా కోటి 5 లక్షలు మహిళల ఖాతాల్లోకి రూ. 4968 కోట్లు బదిలీ చేశామని జగన్ తెలిపారు. లంచాలకు తావు లేకుండా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటికే పెన్షన్ డబ్బులు అందుతున్నాయన్నారు. రూ. 6400 కోట్లు పొదుపు సంఘాలకు ఇస్తున్నామన్నారు.