దశాబ్ధాలుగా అనుభవదారులుగా రైతులకు హక్కులు కల్పిస్తున్నామని సీఎం జ‌గ‌న్‌(CM Jagan) పేర్కొన్నారు. నూజివీడు(Nuzvid) బ‌హిరంగ‌స‌భ‌లో(Public Meeting) ఆయ‌న‌ మాట్లాడుతూ.. పెత్తందార్లకు పేదలను పిలవడం నచ్చదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా భూ సర్వే(Land Survey) చేస్తున్నామన్నారు. రెండు విడతల సర్వే పూర్తైందని, మూడో విడత ప్రారంభించబోతున్నామన్నారు. ఇర‌వై ఏడు ల‌క్ష‌ల న‌ల‌భై రెండు వేల ఎకరాలకు సంబంధించి 16 లక్షల 21వేల మందికి హక్కులు కల్పించబోతున్నామని పేర్కొన్నారు.

గతంలో చంద్రబాబు(Chandrababu) హయాంలో అసైన్డ్ భూములను(Asigned Lands) అత్తగారి సొత్తులా భావించి స్వాధీనం చేసుకునేవారన్నారు. చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చంద్రబాబు చేర్చారని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములపై దళిత రైతుల రుణాలు మాఫీ చేస్తూ, సర్వ హక్కులు కల్పించబోతున్నామన్నారు. లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మూడు కేటగిరీలుగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని జగన్ వెల్లడించారు.

చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ధ్వజమెత్తారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని అన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్‌ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్‌.. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఎస్సీల్లో ఎవరైరా పుట్టాలనుకుంటారా.. బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోలపై(Manifesto) కమిట్‌మెంట్‌ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు.

ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని.. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్‌ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దన్నారు. 2014 చంద్రబాబు, పవన్‌ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకూ ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు.

Updated On 17 Nov 2023 3:12 AM GMT
Ehatv

Ehatv

Next Story