CM Jagan : నన్ను, నా పాలనను చూసి ఓటేయండి.. ప్రజలకు జగన్ సూచన
ఎన్నికల్లో పార్టీని, ఆ పార్టీని నడిపిస్తున్న అధినేతను చూసి కొందరు ఓట్లు వేస్తారు. కొందరు అభ్యర్థి గుణగణాలను పరిగణనలోకి తీసుకుని ఓటేస్తారు. ఎన్నికలలో విజయం సాధించాలంటే రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. అందుకే ఏ పార్టీ అయినా బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇస్తాయి. ఆర్ధికబలంతో ప్రజలలో మంచి పేరున్న అభ్యర్థులనే ఎంపిక చేస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) చాలా మంది సిట్టింగ్‌లను మార్చేస్తున్నారు.
ఎన్నికల్లో పార్టీని, ఆ పార్టీని నడిపిస్తున్న అధినేతను చూసి కొందరు ఓట్లు వేస్తారు. కొందరు అభ్యర్థి గుణగణాలను పరిగణనలోకి తీసుకుని ఓటేస్తారు. ఎన్నికలలో విజయం సాధించాలంటే రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. అందుకే ఏ పార్టీ అయినా బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇస్తాయి. ఆర్ధికబలంతో ప్రజలలో మంచి పేరున్న అభ్యర్థులనే ఎంపిక చేస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) చాలా మంది సిట్టింగ్‌లను మార్చేస్తున్నారు. అభ్యర్థులను మారుస్తున్న తీరులో జగన్ ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) ప్రడే ప్రతి ఓటు తనను చూసి, తన పరిపాలను చూసి పడతాయని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. ఆ విశ్వాసంతోనే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటు ఇటుగా మార్చడం, కొన్ని చోట్ల కొత్తవారికి అవకాశం కల్పించడం అన్నది కుల సమీకరణాల ఆధారంగా జరుగుతున్నదని అనుకోవచ్చు కానీ, అది పూర్తి వాస్తవం కాదు. ప్రజలలో వ్యతిరేకత ఉన్నవారిని తప్పించకుండా కేసీఆర్(KCR) పెద్ద పొరపాటు చేశారు. ఆ పని జగన్ చేయదల్చుకోవడం లేదు. ప్రజా వ్యతిరేకత ఉన్నవారిని నిర్మోహమాటంగా తప్పిస్తున్నారు జగన్. తన పాలన మీద జగన్‌కు అపారమైన నమ్మకం ఉన్నట్టుగా ఉంది. సంక్షేమ పథకాలకు ప్రజలు తప్పకుండా పట్టం కడతారనే విశ్వాసం కూడా ఆయనలో ఉంది. ఇవాళ కాకినాడ సభలో జగన్ మాట్లాడిన తీరే అందుకు నిదర్శనం. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేసిన ఘనతలను, తాము అమలు పర్చిన సంక్షేమ పథకాలను వివరంగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు ఓ సూచన చేశారు. తనను చూసి, తన పార్టీని చూసి ఓటు వేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.