CM Jagan : నేను ఎవరినీ నమ్ముకోలేదు.. నా ధైర్యం, ఆత్మవిశ్వాసం మీరే
ప్రతిపక్షాల తీరుపైన సీఎం జగన్(CM Jagan) మండిపడ్డారు. సోమవారం పల్నాడు(Palnadu) జిల్లా క్రోసూరులో జరిగిన జగనన్న విద్యాకానుక కిట్ల(Education Kits) పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandra babu) లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఏపీలో(AP) పర్యటించిన బీజేపీ(BJP) అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda).. కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit shah) వైసీపీ(YCP) ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేసారు. పరోక్షంగా వారి తీరు ఎండగట్టారు. తనకు బీజేపీ అండగా ఉండకపోవచ్చని తేల్చి చెప్పారు.
ప్రతిపక్షాల తీరుపైన సీఎం జగన్(CM Jagan) మండిపడ్డారు. సోమవారం పల్నాడు(Palnadu) జిల్లా క్రోసూరులో జరిగిన జగనన్న విద్యాకానుక కిట్ల(Education Kits) పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandra babu) లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఏపీలో(AP) పర్యటించిన బీజేపీ(BJP) అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda).. కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit shah) వైసీపీ(YCP) ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేసారు. పరోక్షంగా వారి తీరు ఎండగట్టారు. తనకు బీజేపీ అండగా ఉండకపోవచ్చని తేల్చి చెప్పారు. నేను ఎవరినీ నమ్ముకోలేదని ప్రకటించారు. పేదలకు మంచి చేస్తుంటే తట్టుకోలేని మనస్తత్వం చంద్రబాబుదేనని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఏం చేసిన మద్దతు పలికే దత్తపుత్రుడు ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. తాను వీళ్లను నమ్ముకోలేదని.. కేవలం దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులనే నమ్ముకున్నానని ముఖ్యమంత్రి అన్నారు. జరిగే కురుక్షేత్ర సంగ్రామంలో పెత్తందార్లకు, పేదల పార్టీకి మధ్య యుద్దం జరుగనుందని అన్నారు. నా ధైర్యం, ఆత్మవిశ్వాసం మీరేనంటూ జగన్ ఉద్వేగభరితంగా మాట్లాడారు.
అలాగే.. పిల్లలకు మంచి భవిష్యత్తు అందించేందుకు ఖర్చుకు వెనకాడకుండా పాటుపడుతున్నానని ఏపీ సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు విద్యాకానుక కిట్ల పంపిణీ పండుగలా జరుగుతోందని అన్నారు. ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రజాప్రతినిధులు అందరూ ఈ పండుగలో పాల్గొంటున్నారని.. వరుసగా నాలుగో ఏడాది విద్యాకానుక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఒక్క పథకంపైనే ప్రభుత్వం అక్షరాలా రూ.3,366 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థికి మెరుగైన విద్యా సదుపాయాలను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యాకానుక అందిస్తున్నామని.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు కిట్లను అందజేస్తున్నట్లు వివరించారు. స్కూలు బ్యాగు సైజు పెంచామని, యూనిఫామ్ డిజైన్లోనూ మార్పులు చేశామని సీఎం జగన్ తెలిపారు.
విద్యాకానుక కింద రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు ( ఒక పేజీలో ఇంగ్లీష్, మరో పేజీలో తెలుగులో పాఠ్యాంశాలు), నోట్ బుక్ లు, వర్క్ బుక్ లు, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు తో పాటు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ (6-10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1-5 తరగతి పిల్లలకు) తో కూడిన కిట్‌ను అందజేయనుంది. జగనన్న విద్యాకానుక కిట్లకై ప్రభుత్వం ప్రతి విద్యార్థికీ దాదాపు రూ.2,400 ఖర్చు చేస్తోంది.