CM YS Jagan : జూన్ 4న దేశమంతా ఏపీ వైపు చూడబోతుంది: జగన్
ఆంధ్రప్రదే(Andhra Pradesh)శ్ రాజకీయ చరిత్రలోనే జూన్ 4న సువర్ణాక్షరాలతో కొత్త చరిత్ర లిఖించబోతుందని సీఎం జగన్(CM Jagan) అన్నారు. ఎన్నికల తర్వాత ఐ-ప్యాక్(I-PAC) సభ్యులను కలిసిన సందర్భంగా సీఎం జగన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ చేసిన ఫస్ట్ రియాక్షన్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

CM YS Jagan
ఆంధ్రప్రదే(Andhra Pradesh)శ్ రాజకీయ చరిత్రలోనే జూన్ 4న సువర్ణాక్షరాలతో కొత్త చరిత్ర లిఖించబోతుందని సీఎం జగన్(CM Jagan) అన్నారు. ఎన్నికల తర్వాత ఐ-ప్యాక్(I-PAC) సభ్యులను కలిసిన సందర్భంగా సీఎం జగన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ చేసిన ఫస్ట్ రియాక్షన్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు టైట్ ఫైట్, ఎవరికి ఎడ్జ్ తెలియదన్నట్టుగా వార్తలు రాసుకొచ్చిన మీడియా సంస్థలు కూడా.. సీఎం జగన్ చేసిన ప్రకటన పట్ల షాక్ తిన్నాయి. ప్రతిపక్షాలు, పచ్చ మీడియా, పచ్చ బ్యాచ్ దిమ్మతిరిగిపోయే విధంగా ప్రజలు తీర్పునిచ్చినట్టు సీఎం జగన్ చెప్పారు.
గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లతో సంచలనాత్మక తీర్పునిచ్చిన ఏపీ ప్రజలు, ఈ సారి ఆ రికార్డును అధిగమించబోతున్నామన్నారు. ఈసారి వచ్చే ఫలితాలు ప్రభంజనం సృష్టిస్తాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా విజయంపై కచ్చితమైన సమాచారంతోనే ఆయన ఇలాంటి ప్రకటన చేశారని రాజకీయ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఈ సారి ఎన్నికల ప్రచారంలో తాను అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలను సీఎం జగన్ కోరారు. తన వల్ల మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటు వేయండని జగన్ ఆకర్షణీయంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజలే తనకు స్టార్ క్యాంపైనయిర్స్ అని చెప్పారు. తాను నమ్మకుంది ఆ దేవుడు, ప్రజలనేనని అన్ని వేదికలపైనా ప్రస్తావించారు. ఇక, సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందితేనే వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని కోరారు. ఆయన మాటలు ప్రతీ ఒక్క కుటుంబాన్ని చేరుకున్నాయి. సీఎం జగన్ చేసిన సాయాన్ని ఎవరూ మరిచిపోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వం పట్ల, పాలన పట్ల నమ్మకం ఉంచారు. ఈ ఎన్నికలు పేదలు, పెత్తందార్ల మధ్య జరుగుతున్నట్లుగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థుల మార్పు సమయంలో కూడా కచ్చితమైన నిర్ణయాలే తీసుకున్నారు. ధైర్యంగా అభ్యర్థులను మార్చుకుంటూ వెళ్లారు సీఎం జగన్. ఒక నాయకుడిగా తన నాయకత్వం మీద, పార్టీ మీద, పాలన మీద ఉన్న నమ్మకాన్ని ఈ ప్రకటన కొలమానంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
