Ap Cabinet New Ministers : జగన్ షాకింగ్ నిర్ణయం.. క్యాబినెట్లోకి కొత్త మంత్రులు.!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయా? త్వరలో కేబినెట్‌లో కొత్తవారు చేరతారా.? ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలను బట్టి అవుననే అనుకోవాలి. కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ap cabinet new ministers
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయా? త్వరలో కేబినెట్‌లో కొత్తవారు చేరతారా.? ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలను బట్టి అవుననే అనుకోవాలి. కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల పనితీరు బాగాలేకపోతే వారిని తప్పించడానికి వెనుకాడనని జగన్ అనడంతో కొందరు మంత్రుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కేబినెట్ నుంచి ఇద్దరు ముగ్గురిని మార్చేస్తామని జగన్ సూచనప్రాయంగా తెలిపారు కూడా. శాఖాపరంగా, పనితీరు ఆధారంగా మార్పులు ఉంటాయని జగన్ సంకేతాలు ఇచ్చారు. సక్రమంగా పనిచేయని మంత్రులకు ఉద్వాసన తప్పదన్నారు. దీంతో కేబినెట్ నుంచి ఎవరిని తప్పిస్తారన్న దానిపై ఉత్కంఠ పెరిగింది. దాడిశెట్టి రాజా స్థానంలో తోట త్రిమూర్తులను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చెల్లుబోయిన వేణును కూడా తప్పించే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గంలో మర్రి రాజశేఖర్‌కు కూడా చోటు దక్కవచ్చు.
