ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. మార్కాపురంలో జరిగిన ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెల్ఫీ చాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫొటోలు కాదని, పేదవాడి ఇంటి ముందు నిలబడి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ అని చెప్పగలగాలని సీఎం జగన్ అన్నారు. దానికి ఆ కుటుంబం కూడా చిరునవ్వుతో ఆశీర్వదిస్తే దానిని సెల్ఫీ […]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. మార్కాపురంలో జరిగిన ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెల్ఫీ చాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫొటోలు కాదని, పేదవాడి ఇంటి ముందు నిలబడి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ అని చెప్పగలగాలని సీఎం జగన్ అన్నారు. దానికి ఆ కుటుంబం కూడా చిరునవ్వుతో ఆశీర్వదిస్తే దానిని సెల్ఫీ అంటారని.. దానినే గొప్ప సెల్ఫీ అంటారన్నారు.

మీ ప్రభుత్వ హయాంలో చేసిన పనిని పేదవాడి ఇంటిముందు నిలబడి చెప్పగలరా అని చంద్రబాబు(Chandrababu)కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా, ఏ గ్రామాన్ని తీసుకున్నా గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ జరిగిన మంచి ఏమిటో తెలుస్తుందని అన్నారు. మీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని, ఈ నాలుగేళ్ల మా పాలనలో జరిగిన మంచిని బేరీజు వేసుకుని చూసే సత్తా నీకు ఉందా బాబూ? అని ప్రశ్నించారు. చాలెంజ్ అంటే ఇదే.. ఎవరి హయాంలో ఏం జరిగిందని, మేలు చేసే ప్రభుత్వం ఏదనేది ప్రజలకు తెలుసని జగన్ అన్నారు.

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(CM Jagan) రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని బుధవారం విడుదల చేశారు. అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు సీఎం జగన్. ఓసీ వర్గాలోని అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్నదే లక్ష్యమని.. పేదరికానికి కులం, మతం ఉండదన్నారు. మాది మహిళ పక్షపాతి ప్రభుత్వం. దేశంలో ఈబీసీ నేస్తం లాంటి పథకం ఎక్కడా లేదు.. రెండేళ్లలో రూ.1,258 కోట్లు ఈబీసీ నేస్తం ద్వారా మహిళల ఖాతాల్లో జమ చేశామని జగన్ చెప్పుకొచ్చారు.

Updated On 12 April 2023 6:20 AM GMT
Yagnik

Yagnik

Next Story