CM Jagan Alert To Ministers : ఎన్నికలకు సిద్దంగా ఉండండి.. మంత్రులకు సీఎం దిశానిర్దేశం..!
ఏపీలో ఎన్నికలకు(AP Elections) సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్(CM Jagan) మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో(Cabinet Meeting) ఈ మేరకు చర్చ జరిగినట్లు సమాచారం.
ఏపీలో ఎన్నికలకు(AP Elections) సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్(CM Jagan) మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో(Cabinet Meeting) ఈ మేరకు చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్రం ఒన్ నేషన్.. ఒన్ ఎలక్షన్..(One Nation One Election) దిశగా ఆలోచన చేస్తున్న సమయంలో అక్కడి నిర్ణయాలకు అనుగుణంగా.. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు.. ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కేబినెట్ భేటీలో అధికారిక చర్చల అనంతరం.. మంత్రులతో సీఎం కొంత సమయం రాజకీయ అంశాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఎన్నికలకు సంబంధించి కీలక సూచనలు చేసినట్లు సమాచారం. కేంద్రంలో జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్న వేళ.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలని మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం ఒన్ నేషన్.. ఒన్ ఎలక్షన్.. పేరుతో ఎన్నికలకు వెళ్తే.. ఏపీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని.. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సివుందని.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్దంగా ఉండాలని మంత్రులకు సీఎం సూచించినట్లు సమాచారం.