గత బీఆర్‌ఎస్‌(Brs) ప్రభుత్వంలో జయేష్‌ రంజన్‌(Jayesh rajan) అంటే తెలియనివారుండరు.

గత బీఆర్‌ఎస్‌(Brs) ప్రభుత్వంలో జయేష్‌ రంజన్‌(Jayesh rajan) అంటే తెలియనివారుండరు. అఫ్‌ కోర్స్‌ ప్రస్తుత కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వంలో కూడా ఆయే పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. గడిచిన పదేళ్లుగా ఆయన తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, ఐ.టి. శాఖల ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. 2014-23 కాలంలో తెలంగాణకు అనేక బహుళ జాతీయ సంస్థలను ఆకర్షించడంలో రంజన్ కీలక పాత్ర వహించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం జయేష్ రంజన్‌ను తమ పరిశ్రమల శాఖ అధిపతిగా నియమించుకోవాలని భావించింది. అయితే ఆ అనుభావాలను ఇప్పుడు తమ ప్రయోజనాలకు వాడుకోవాలని చంద్రబాబు, లోకేష్(Nara Lokesh) ఆసక్తి చూపిస్తున్నారట. కానీ సర్వీసు నిబంధనల ప్రకారం ఆయన పొరుగు రాష్ట్రానికి డిప్యుటేషన్ పై వెళ్లే అవకాశం లేకపోవటంతో రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని సిద్ధపడుతున్నారని తెలిసింది. అంతే కాకుండా రంజన్ కింద పనిచేసేందుకు ఏపీకి చెందిన ఐ.ఎ.ఎస్. అధికారులు(IAS Officers) విముఖత వ్యక్తం చేస్తున్నారట. దీంతో రంజన్ నియామకం కాస్త సందిగ్ధంలో పడింది. అయితే, రంజన్ సేవలను ఎలాగైనా వినియోగించుకోవాలని ముఖ్యంగా లోకేష్ పట్టుదలగా ఉన్నారు. తద్వారా ఆంధ్ర ప్రదేశ్ కు నూతన పరిశ్రమలను ఆకర్షించాలని ప్రణాళిక వేస్తున్నారని సమాచారం. హైదరాబాద్ కేంద్రంగానే ఆయనను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పనిచేయించనుందని తెలుస్తోంది. అయితే జయేష్‌ను ఏ హోదాలో నియమిస్తారో ఇంకా స్పష్టత రాలేదు. 1992 బ్యాచ్ కు చెందిన రంజన్‌కు 2027 సెప్టెంబర్ వరకు సర్వీస్ ఉంది.

Eha Tv

Eha Tv

Next Story