Chandrababu : జగన్ వదిలిన 'బాణం' చంద్రబాబుకు చిక్కిందా..?
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan), ఆయన చెల్లెలు షర్మిల(YS Sharmila) మధ్య ఆస్తి(Assests) తగాదాలు తారాస్థాయికి చేరాయి.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan), ఆయన చెల్లెలు షర్మిల(YS Sharmila) మధ్య ఆస్తి(Assests) తగాదాలు తారాస్థాయికి చేరాయి. సరస్వతీ పవర్ షేర్ల బదిలీ వ్యవహారం ఇప్పుడు చినికిచినికి పెద్ద దుమారం చెలరేగుతోంది. సరస్వతి పవర్‌లో తల్లి పేరుతో ఉన్న షేర్లను మార్చడంతో ఇది ముదిరిపాకన పడింది. అప్పటికే 49 శాతం తల్లిపేరిట మార్పించారు జగన్. మిగతా 51 శాతాన్ని కూడా గిఫ్ట్‌గా ఇస్తానని రాసి ఇచ్చారు. దీంతో సరస్వతీ పవర్‌ను(saraswati Power plant) పూర్తిగా జగన్ వదిలేసుకున్నట్లే. కేసుల వ్యవహారం పూర్తిగా తొలగిపోయాకే ఆ షేర్లను చట్టబద్ధంగా షర్మిల పేరిట బదిలీ చేస్తానని మాట ఇచ్చారు. అయితే కోర్టు కేసుల వ్యవహారం కొలిక్కిరాకుండా ఎందుకు షేర్లను ఎందుకు మార్పించారో తెలియదు. వైసీపీ వర్గాలు మాత్రం జగన్‌ను ఇరుకున పెట్టేందుకే చంద్రబాబుతో(CM chandrababu) కలిసి షర్మిల ఇలా చేసిందని చెప్తున్నాయి. జగన్‌కు తెలియకుండా ఆయన పేరుతో ఉన్న షేర్లను తల్లి పేరు మీద షర్మిల మార్పించారని వారి వాదన.
అయితే జగన్‌కు తెలిసి చేసినా, తెలియక చేసినా ఇరుకున పడేది జగన్ మాత్రమే. ఆ కంపెనీల ఆస్తులన్నీ ఈడీ(ED), సీబీఐ(CBI) అటాచ్‌లో ఉన్నాయి. ఆ ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలూ జరపకూడదని హైకోర్టు(High court) స్టే కూడా ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే జగన్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టినట్లే కదా అని వైసీపీ(YCP) వర్గాల వాదన. దీంతో షేర్ల బదిలీ జరగడంతో జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను జగన్ ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా చర్యలకు పాల్పడితే బెయిల్‌పైన కూడా ప్రభావం పడుతుందన్న కోణంలో జగన్ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించారు. దీనిపైన కూడా షర్మిల రాద్ధాంతం చేస్తోందంటున్నారు. చంద్రబాబుకు పెంచి పోషించే ఎల్లో మీడియాలో షర్మిలకు ఏదో అన్యాయం జరిగినట్లు చూపించడమే కాకుండా తల్లిని కూడా కోర్టును జగన్ కోర్టుకు ఈడ్చుతున్నారని ఆయనపై తప్పుడు కథనాలు రాస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. తన పేరుతో ఉన్న షేర్లను తల్లి పేరుతో మార్చడంతోనే విధిలేని పరిస్థితుల్లోనే జగన్ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందనేది వారి వాదన. జగనన్న వదిలిన బాణం అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు చేతికి చిక్కి.. రివర్స్ అటాక్ చేస్తోందంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు షర్మిల రాసిన లేఖ టీడీపీకి ఎలా వచ్చిందని.. ఆమె రాసిన లేఖను టీడీపీ సోషల్ మీడియా వేదికలో ఎలా పోస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. షర్మిల లేఖ టీడీపీకి ఎలా చేరిందనే లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అన్నట్లు ఉందంటున్నారు.