ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు(Chandra) ప్రజలకు ఇచ్చిన హామీలను ఈజీగా మర్చిపోతుంటారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు(Chandra) ప్రజలకు ఇచ్చిన హామీలను ఈజీగా మర్చిపోతుంటారు. అలాంటిది పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను మాత్రం ఎలా గుర్తుపెట్టుకుంటారు? పార్టీ నాయకులు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకునేంత తీరక చంద్రబాబుకు ఉండదు. అందుకు బోల్డన్ని ఉదాహరణలను చూపించొచ్చు. లేటెస్ట్‌గా వర్మ ఎపిసోడ్‌ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌. ఎమ్మెల్సీ అవకాశాలు వచ్చినప్పుడు వర్మకే ఫస్ట్‌ ప్రిఫరెన్స్‌ ఇస్తామని చంద్రబాబు అప్పుడు ప్రకటించారు. పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) కోసం వర్మ(Varma) పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టేసిన విషయం తెలిసిందే కదా! అప్పుడు వర్మ చేసిన త్యాగానికి ప్రతిఫలం మొదటి ఎమ్మెల్సీ సీటు అని చంద్రబాబు ఇచ్చిన మాట ఆయనకు గుర్తుండకపోవచ్చు కానీ, మిగతావారందరికీ గుర్తుంది. మొదటి ఎమ్మెల్సీ సీటు కూడా దాటిపోయింది. వర్మకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) రాబోతున్నాయి. ఇది టీడీపీ గ్యారంటీగా గెలిచే సీటు. మరి ఇప్పుడైనా ఆ టికెట్ వర్మకు ఇవ్వాలి కదా! చంద్రబాబు రాజకీయ లౌక్యం కారణంగా వర్మ ఎంతో నష్టపోయారు. ఆలపాట రాజేంద్రప్రసాద్‌ కూడా నష్టపోయారనుకోండి. వీరిద్దరిలో ఒకరు పవన్‌కల్యాణ్‌ కోసం, మరొకరు నాదెండ్ల మనోహర్‌(Nadendla manohar) కోసం తమ సీట్లను త్యాగం చేశారు. ఇప్పుడు గుంటూరు కృష్ణా జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు మాత్రం చంద్రబాబు న్యాయం చేస్తున్నారు. ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కాబట్టే చంద్రబాబు న్యాయం చేస్తున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. గోదావరి జిల్లాల విషయానికి వచ్చేసరికి పిఠాపురం వర్మను మర్చిపోయారు. ఇక్కడి నుంచి కాపు సామాజికవర్గానిక, ఎస్సీ సామాజికవర్గానికో అవకాశం ఇవ్వాలని చంద్రబాబునాయుడు అనుకుంటున్నారట. ఇందుకోసం మొదట కె.ఎస్‌.జవహర్‌ను అనుకున్నారు. ఇప్పుడు పేరాబత్తుల రాజశేఖర్‌కు ఆ అవకాశం ఇద్దామనుకుంటున్నారు. మొత్తానికి వర్మను చాలా కన్వీనియంట్‌గా పక్కకు తప్పించారు చంద్రబాబు.

Eha Tv

Eha Tv

Next Story