CM Chandrababu : ప్రపంచ కమ్మ మహాసభలకు చంద్రబాబు దూరం!
ఈ నెల 20, 21 తేదీలలో ప్రపంచ కమ్మ మహాసభలు(World Kamma Mahasabhas) జరగనున్నాయి
ఈ నెల 20, 21 తేదీలలో ప్రపంచ కమ్మ మహాసభలు(World Kamma Mahasabhas) జరగనున్నాయి. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించబోతున్న ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) హాజరవుతారు. సభలను ఆయన ప్రారంభిస్తారు. నిజానికి ఈ సభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(CM Chandrababu) కూడా రావాల్సింది. తెలంగాణ సీఎం రేవంత్, ఆంధ్ర సీఎం చంద్రబాబు ఒకే వేదిక మీద ఆసీనులై ఉంటే చూడాలని వారిద్దరి అభిమానులు ముచ్చపడ్డారు. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల చంద్రబాబు ఈ సభలకు హాజరుకావడం లేదు. సాధారణంగా చంద్రబాబు కుల సంఘాల సమావేశాలకు హాజరుకారు. ఆ కారణంగానే కమ్మ మహాసభలకు కూడా రావడం లేదేమో! 20వ తేదీ ఉయం 10.30 గంటలకు కమ్మ గ్లోబల్ సమ్మిట్ మొదలవుతుంది. మొదటి రోజు నాలుగు రాష్ట్రాలలో కమ్మ సామాజికవర్గం నుంచి విజయం సాధించిన 50 మంది ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ముగింపు సమావేశాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారు.ఇక పెట్టబడులపై జరిగే సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అటెండవుతారు.