బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వచ్చిన అన్‌స్టాపబుల్‌(Unstopable) టాక్ షో బ్రహ్మండమైన సక్సెస్‌ను అందుకుంది.

బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వచ్చిన అన్‌స్టాపబుల్‌(Unstopable) టాక్ షో బ్రహ్మండమైన సక్సెస్‌ను అందుకుంది. ఆహా(AHA) ఓటీటీలో వచ్చిన మూడు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్-4 (Unstoppable season-4) సిద్ధమవుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్‌లో చంద్రబాబును బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. మా బావగారు, మీ బాబుగారు అంటూ బాలకృష్ణ చంద్రబాబును ఇంట్రడ్యూస్‌ చేశారు. ఈ టాక్‌ షోలో చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. అరెస్ట్ నుంచి తాజా రాజకీయాల వరకు అన్ని విషయాలు చంద్రబాబు చెప్పారు. జైలు జీవితం గురించి మాట్లాడుతూ చంద్రబాబు ఉద్వేగానికి గురయ్యారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టనని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. అక్టోబర్‌ 25వ తేదీ రాత్రి 8.30కు ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

Eha Tv

Eha Tv

Next Story