తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జే.శ్యామలరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి అక్షింతలు పడ్డాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జే.శ్యామలరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి అక్షింతలు పడ్డాయి. శ్రీవారి ప్రసాదం లడ్డూ విషయంలో కాదు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Bosta Sathyanarayana) సిఫార్సు లేఖకు ఏకంగా 26 మందికి శ్రీవారి దర్శనాన్ని కల్పించినందుకు! ఎమ్మెల్యే(MLA), ఎంపీల(MP) సిఫారసు లేఖపై రోజుకు ఆరుగురుకి చొప్పున టీటీడీ(TTD) దర్శన భాగ్యం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సిఫార్సు లేఖపై ఏకంగా 26 మందికి దర్శనం కల్పించడంపై చంద్రబాబు(ChandraBabu)కు ఫిర్యాదులు వెళ్లాయి. ఏదో బొత్సపై ఉన్న అభిమానంతో శ్యామలరావు(Shyamala Rao) అలా చేసి ఉంటారు. గతంలో బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అదే శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఐఏఎస్‌ అధికారి జే.శ్యామలరావు బాధ్యతలు నిర్వర్తించారు. ఆ అనుబంధంతోనే ఈవో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ దర్శనాలు ఇచ్చారన్నది టీడీపీ నేతల వాదన! వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలతో అంటకాగారంటే అనుకోవచ్చునని, ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ వారికే అధిక ప్రాధాన్యం ఇవ్వడమేమిటని గట్టిగా అడుగుతున్నారు. ఈ ఫిర్యాదులు చంద్రబాబు దగ్గరకు వెళ్లడంతో ఆయన శ్యామలరావును క్లాస్‌ తీసుకున్నారని సమాచారం!

ehatv

ehatv

Next Story