ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) మాటిమాటికి బెంగళూరు వెళుతున్నాడంటూ టీడీపీ(TDP) నాయకులు విమర్శలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) మాటిమాటికి బెంగళూరు వెళుతున్నాడంటూ టీడీపీ(TDP) నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. జగన్‌ బెంగళూరు వెళుతున్నారంటూ పదే పదే ఆరోపిస్తున్న మీలో ఏ ఒక్కరైనా తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అంటూ సవాల్‌ విసిరారు. 1) 2014 ఎన్నిక‌లప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ.. హైదరాబాద్‌లో ఓటు వేసిన మీకు జగన్‌ బెంగళూరు వెళ్తున్నారని మాట్లాడే అర్హత ఉందా? 2) 2019 ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయిన మీరు హైద‌రాబాద్‌లోనే ఉంటూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చుట్టంచూపుగా వచ్చి వెళ్లేవారు అవునా? కాదా? కొవిడ్‌ సమయంలో రాష్ట్రం మొత్తం అల్లాడుతుంటే మీ తండ్రీకొడుకులు హైదరాబాద్‌ పారిపోయి తలదాచుకోలేదా? 3)రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ప‌నిచేస్తున్న మీకు ఇప్పటి వ‌ర‌కు రాష్ట్రంలోనే కాదు.. మీరు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పంలో కూడా సొంత ఇల్లు లేద‌న్నది వాస్తవ‌మా? కాదా? 4)మీ వ్యాపారాలు, ఆస్తులు, మీ సంసారాలు అన్నీ ప‌క్క రాష్ట్రాల్లో చేసుకుంటూ జ‌గ‌న్ బెంగ‌ళూరు వెళ్తున్నార‌ని మాట్లాడ‌డానికి మీకు కాసింతైనా సిగ్గనిపించ‌డం లేదా? 5) అవ‌న్నీ ప‌క్కన పెడితే.. రెండోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మీరు ఈసారి అయినా రాష్ట్రంలోనే ఉంటున్నారా అంటే అదీ లేదు.. వీకెండ్ కాగానే హైద‌రాబాద్ వెళ్లిపోతూ అక్కడ ఎంజాయ్ చేసి మ‌ళ్లీ సోమ‌వారం రాష్ట్రానికి తిరిగి వ‌స్తున్నది వాస్తవ‌మా? కాదా? 6) మీ మాదిరి వీకెండ్ ఎంజాయ్‌మెంట్ కోసం జ‌గ‌న్2019-24 మ‌ధ్యలో ఎప్పుడైనా వెళ్లారా? ఇప్పుడు చెప్పండి.. గురివింద సామెత మీకు క‌రెక్టుగా స‌రిపోతుందా? లేదా? అంటూ ప్రశ్నలు సంధించారు. జగన్‌ను విమర్శించే స్థాయి, అర్హత మీకు లేవని, కాబట్టి సైలెంట్‌గా ఉంటే మంచిదని సలహా ఇచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story