విజయవాడను వరద(Vijayawada floods) ముంచెత్తిన సంగతి తెల్సిందే.

విజయవాడను వరద(Vijayawada floods) ముంచెత్తిన సంగతి తెల్సిందే. వరదబాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు(CM chandrababu) క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ అన్ని శాఖల ఉద్యోగులతో బాధితులకు(Victim) సహాయక చర్యలు అందిస్తున్నారు. అయినా కానీ క్షేత్ర స్థాయిలో ఇంకా చాలా మందికి ఆహారం, కనీస వస్తువులు అందడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం అమరావతిలో(Amravathi) వరద తీవ్రత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అనుకున్నంత పని అధికారులు చేయడం లేదన్నారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎందుకు ఆలస్యమవుతుందని అధికారులపై రుసరుసలాడారు. బాదితులకు సరిపడా ఆహారాన్ని అందుబాటులో ఉంచినా కూడా బాధితులకు ఎందుకు అందడంలేదని సీరియస్ అయ్యారు. ఆహారం పంపిణీ ఆలస్యం చేసిన అధికారులపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజలకు సేవ చేయడానికే అని, పని చేయడం ఇష్టం లేకుంటే మానేయాలని చంద్రబాబు అధికారులపై మండిపడ్డారు. స్వయంగా తానే క్షేత్రస్థాయిలో పని చేస్తుంటే అలసత్వం వహిస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా చంద్రబాబు తీరుపై అధికారులు, ఉద్యోగాలు లోలోన గొణుక్కుంటున్నారని సమాచారం. ఎంత పనిచేసినా ఈ తిట్ల దండకం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారట. బాధితులకు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని బోట్లు, హెలికాప్టర్లు లేకపోవడంతోనే కొంత ఆలస్యమైందని, దానికి తమను బాధ్యులు చేస్తే ఎలా అని అనుకుంటున్నారట.

Eha Tv

Eha Tv

Next Story