వైసీపీ సోషల్‌ మీడియా(YCP social media) కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని(Varra Ravinder reddy) పోలీసులు వదిలిపెట్టడంపై ప్రభుత్వం సీరియసైంది.

వైసీపీ సోషల్‌ మీడియా(YCP social media) కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని(Varra Ravinder reddy) పోలీసులు వదిలిపెట్టడంపై ప్రభుత్వం సీరియసైంది. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు(Nara chandrababu), నారా లోకేష్(Nara lokesh), పవన్ కల్యాణ్(Pawan kalyan), వంగలపూడి అనిత(Vangalapudi anitha), వైఎస్ షర్మిల(YS sharmila) సహా పలువురు ప్రతిపక్ష నేతలపై వర్రా రవీందర్ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి . అయితే మంగళవారం రాత్రి కడప పోలీసులు పులివెందులలో వర్రా రవీందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కడపకు తీసుకువచ్చి రహస్యప్రాంతంలో విచారించి ఆ తర్వాత ఈరోజు తెల్లవారుజామున ఆయనను విడిచిపెట్టారు. 41A నోటీసులు ఇచ్చి వర్రా రవీందర్‌రెడ్డిని వదిలిపెట్టారు. దీంతో వర్రా రవీందర్‌రెడ్డిని విడుదల చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం చెందింది. డీజీపీ ద్వారకా తిరుమలరావుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చిన్నచౌక్‌ సీఐను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఎస్పీ హర్షవర్దన్‌ రాజును హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వర్రా రవీందర్‌రెడ్డి వ్యవహారంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. 41 నోటీసులు అందుకున్న వర్రా రవీందర్‌రెడ్డి కనిపించకుండాపోయారు. దీంతో వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు గాలిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story