రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఎట్టకేలకు సీఎం చంద్రబాబు స్థలం కొన్నారు.

రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఎట్టకేలకు సీఎం చంద్రబాబు స్థలం కొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరుతో ఉన్న 25 వేల చదరపు గజాల ప్లాట్‌ను కొన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబు(CM Chandra babu)కు.. తాను డిసైడ్ చేసిన రాజధానిలో సొంత ఇల్లు లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ విమర్శలకు చెక్‌ పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటివరకు చంద్రబాబు క్రిష్ణా నది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్టు హౌస్‌లో ఉంటున్నారు. అయితే తాజాగా రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. దీంతో.. ఇక్కడ ఇంటిని నిర్మించుకొని షిప్టు అవుతారని చెప్తున్నారు. వెలగపూడి పరిధిలోని ఈ-6 రోడ్డుకు ఆనుకొని ఉన్న25 వేల చదరపు అడుగులు అంటే దాదాపు ఐదెకరాలకుపైగానే ఉన్న స్థలాన్ని కొన్నారు. ఇప్పటికే సదరు రైతులకు డబ్బులు చెల్లించనట్లు తెలుస్తోంది. ఈ భూమికి నాలుగు వైపులా రోడ్డు ఉంది. ఈ స్థలానికి రెండు కి.మీ.దూరంలో ఎన్జీవోల సముదాయాలు, జడ్జీల బంగ్లాలు, ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ఈ స్థలంలో కొంత భాగం ఇల్లు, ఆఫీస్, సెక్యూరిటీ రూంలు నిర్మించనున్నారని తెలుస్తోంది.

ehatv

ehatv

Next Story