తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు(Chandrababu) మళ్లీ ఎదురుదెబ్బే తలిగింది.

తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు(Chandrababu) మళ్లీ ఎదురుదెబ్బే తలిగింది. లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు(supreme court) కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ(CBI) డైరెక్టర్‌ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ను(SIT) ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది. కేంద్ర అధికారిని ఏర్పాటు చేస్తే మంచిదని, లడ్డూ వ్యవహారంపై ఆరోపణలు నిజమైతే హర్షించదగనిదని, ఈ కేసు విచారణకు సిట్‌ ఒక్కటే సరిపోదు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలని, సెంట్రల్‌ నుంచి సూపర్‌ విజన్‌ ఉండాలని కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జర్నల్‌ తుషార్‌ మెహతా వాదించారు. అయితే ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. 'ఈ అంశంపై పొలిటికల్‌ డ్రామా జరగొద్దనుకుంటున్నాం. సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు? కల్తీ జరిగిందని మీరు ఊహించుకుంటున్నారా? కల్తీ నెయ్యి కేసు సీబీఐకి ఎందుకు దర్యాప్తు చేపట్టకూడదు? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్వతంత్ర దర్యాప్తు ఉంటే మంచిదనే భావనకు వచ్చింది. సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఇద్దరు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు ఉండొచ్చు కదా అని చెప్పింది. రాజకీయంగా లడ్డూపై వ్యాఖ్యలు చేయొద్దని చెబుతూ సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో అయిదుగురు సభ్యులతో దర్యాప్తు జరపమని ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్వంతంత్ర సిట్‌ ఏర్పాటు చేసింది. లడ్డూ కల్తీ జరిగితే చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు. స్వంతంత్ర సిట్‌ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. సిట్‌ సభ్యులుగా ఇద్దురు సీబీఐ నుంచి, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, FSSAI(ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ఇండియా) నుంచి ఒకరు దర్యాప్తు చేపట్టనున్నారు.

Eha Tv

Eha Tv

Next Story