ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకటంలో పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకటంలో పడ్డారు. వక్ఫ్(Waqf) సవరణ బిల్లుపై ఆయన మింగలేక కక్కలేక ఉన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని ముస్లిములు కోరుతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిస్తే బాగోదని హెచ్చరిస్తున్నారు. మొన్నటి ఎన్నికలలో ముస్లిములు చంద్రబాబు కు ఓటు వేశారు. అందుకే నిర్భయంగా ఆ డిమాండ్ చేస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ(TDP) మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) మాత్రం వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కారుపై ముస్లిములు కోపంతో ఉన్నారు. విజయవాడలో జరిగిన జమాతే ఇస్లామి హింద్ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏమిటో స్పష్టం చేసింది.ఎంపీ విజయసాయి రెడ్డి తాము వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతి రేకిస్తున్నామని చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ముస్లిముల వెంటే ఉంటారని చెప్పారు.వక్ఫ్ సవరణ బిల్లును కేబినెట్ లో పెట్టినప్పుడు టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించాల్సింది పోయి మద్దతుగా మాట్లాడారని విజయసాయి రెడ్డి తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ehatv

ehatv

Next Story