కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భోజనం ఖర్చు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భోజనం ఖర్చు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమరావతిలో ఈనెల 11, 12 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు అధికారులు హాజరయ్యారు. మంత్రుల డ్రైవర్లు, ఎస్కార్టు సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది అందరూ కలిపి 12 వందల మంది పాల్గొన్నారని అంచనా. మంత్రులు, అధికారుల సహాయ సిబ్బందికి మీడియాకు పెట్టిన భోజనమే పెట్టారు. ముఖ్యమంత్రి, మంత్రులకు, ఐఏఎస్, ఐపీఎస్‌లకు పెట్టిన భోజనాలకు నామినేషన్ లేకుండా కాంట్రాక్ట్ ఇచ్చారు. విజయవాడకు చెందిన ఓ హోటల్‌కు దీని బాధ్యతలు అప్పగించారు. దీంతో భోజనాలకు భారీగానే బిల్లు వేశారు. సాధారణ భోజనంలాగే ఉన్నా కానీ రెండు రోజుల భోజనాలు, స్నాక్స్‌ ఖర్చు రూ.1.2 కోట్లు వేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మాత్రం భోజనానికి ఇంత బిల్లులు అవసరమా అని చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అనవసర ఖర్చులు చేస్తూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు ఎక్కుపెట్టాయి.

Updated On 23 Dec 2024 1:50 PM GMT
ehatv

ehatv

Next Story