Amaravati : అమరావతికి మళ్లీ విరాళాల సేకరణ?
Amaravati : అమరావతికి మళ్లీ విరాళాల సేకరణ?
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మళ్లీ తెలుగుదేశంపార్టీ(TDP) ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబునాయుడు(chandrababu) మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి తన హయాంలోనే అమరావతి(Amaravati) నిర్మాణం జరగాలన్నది చంద్రబాబు ఆలోచన. రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి విరాళాలు(donation) సేకరించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోందట! ఈ మేరకు ఆ పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చే నడుస్తోందని అంటున్నారు. ఇంతకు ముందు కూడా పది రూపాయలకు తక్కువ కాకుండా అమరావతి నిర్మాణానికి విరాళం పంపాలని చంద్రబాబు పిలుపు ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా వంద రూపాయలకు తక్కువ కాకుండా విరాళం పంపాలని అడగాలనుకుంటున్నారట! అయితే తెలుగుదేశంపార్టీలోని కొందరికి ఈ ఆలోచన నచ్చడం లేదు. పోయినసారి ఇలాగే పిలుపు ఇచ్చి, మిగిలిన ప్రాంతాలకు శత్రువులయ్యామని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి కోసమే పని చేస్తున్నదని, డబ్బుంతా అక్కడే ఖర్చు పెడుతున్నదని అపప్రద వచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి ఎన్ని వేల కోట్లైనా పెట్టుబడి పెట్టాల్సిందేనన్నది కొందరి వాదన.