ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి వదర పోటెత్తింది.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి వదర పోటెత్తింది. దాంతో కరకట్ట వెంబడి ఉన్న నివాసాల్లోకి నీళ్లు వచ్చాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(chandrababu) ఇంటిని కూడా వరద ముంచెత్తింది. కనీసం సామాన్లు కూడా బయటకు తెచ్చుకోలేనంతగా రెండో అంతస్తు వరకు నీళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పారు. తన అధికార నివాసానికి నీళ్లు వచ్చాయని చంద్రబాబే చెప్పడం విశేషం. చంద్రబాబు ఉంటున్న నివాసం అక్రమ కట్టడమని ఇప్పుడు తేటతెల్లమయ్యింది. అక్రమ కట్టడంలో సీఎం నివాసముండటమేమిటని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు నిలదీసింది. రెండు రోజులుగా కృష్ణా నదికి తీవ్రంగా వరద రావడంతో ఆదివారం ఉదయం 6 గంటలకే ఇంటిని వరద నీరు చుట్టుముట్టింది. ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచిపెట్టారు. ఆదివారం నుంచి చంద్రబాబు విజయవాడలోని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉంటున్నారు. అయితే చంద్రబాబు నివాసం మునిగిపోయిందన్న వార్తల్లో నిజం లేదని టీడీపీ అంటోంది. ఆ పార్టీ అనుకూల మీడియా కూడా అలాగే రాస్తూ వస్తున్నాయి. చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ మునిగిపోవడం అసాధ్యమని టీడీపీ సోషల్ మీడియా అంటోంది. చంద్రబాబే తన ఇల్లు మునిగిందని చెప్పిన తర్వాత వీరి మాటలను ఎవరు పట్టించుకుంటారు?