CM Chandrababu : కూటమి నేతలకు దడపుట్టిస్తున్న చంద్రబాబు వ్యాఖ్యలు
యధాలాపంగా అన్నారో, లేకపోతే మోదీ(Narendra Modi) సారథ్యంలోని బీజేపీతో(BJP) పెట్టుకోవడం ఎందుకనుకున్నారో తెలియదు కానీ చంద్రబాబు(Chandrababbu) కూడా జమిలీ ఎన్నికలకు(Jamili elections) సై అనేశారు.
యధాలాపంగా అన్నారో, లేకపోతే మోదీ(Narendra Modi) సారథ్యంలోని బీజేపీతో(BJP) పెట్టుకోవడం ఎందుకనుకున్నారో తెలియదు కానీ చంద్రబాబు(Chandrababbu) కూడా జమిలీ ఎన్నికలకు(Jamili elections) సై అనేశారు. వన్ నేషన్, వన్ ఎలెక్షన్(One nation One election) విధానం చాలా మంచిదని కితాబులు ఇచ్చారు. జమిలీ ఎన్నికలు జరపాల్సిందే అన్నట్టుగా మాట్లాడారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు అయిదేళ్ల కాలానికి ఓట్లు వేసి గెలిపించారు కానీ, ఇలా మూడేళ్లకో , నాలుగేళ్లకో కాదని మనసులో అనుకుంటున్నారు. నిజంగానే జమిలి ఎన్నికలు వస్తే కూటమి అధికారం ఎంత కాలం అన్నది చంద్రబాబు కూడా చెప్పలేని పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమిలి ఎన్నికలపై చాలా పట్టుదలతో ఉన్నారు. తమ హయాంలోనే జమిలి ఎన్నికలు జరిగి తీరతాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit shah) కరాఖండిగా చెప్పేశారు. ఆ లెక్కన 2029లోపే ఎన్నికలు జరుగుతాయన్న మాటేగా! వచ్చే నెలలో జరగనున్న శీతాకాలపు పార్లమెంట్ సమావేశాలలో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టబోతున్నది కేంద్ర ప్రభుత్వం. అటు పిమ్మట దేశ వ్యాప్తంగా రాష్ట్రాల నుంచి తీర్మానాలను తీసుకోనుంది. దేశంలో మెజారిటీ రాష్ట్రాల ప్రభుత్వాలు బీజేపీ కనునస్ననలోనే నడుస్తున్నాయి. ఎటొచ్చి బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏం చేస్తాయన్నదే ప్రశ్న. జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్టు కేరళలో తీర్మానం చేయడాన్ని ఈ సందర్భంగా పేర్కొనాలి. ఆంధ్రప్రదేశ్ మాత్రం జమిలి ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే 2026లోనో, 2027లోనో వస్తాయి. మొత్తంగా 2027లోపూ జమిలి ఎన్నికలను ముగించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత జమిలి ఎన్నికలకు మద్దతు ఇస్తూ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే బీజేపీ అధిష్టానం చంద్రబాబుకు ఏదో హింట్ ఇచ్చే ఉంటుంది. అందుకే చంద్రబాబు ఓపెన్ అయ్యారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులయ్యింది. ఈ వందరోజుల పాలన పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. విజయవాడ వరదల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఫెయిలయ్యిందన్నది స్థానికంగా వినిపిస్తున్న టాక్! అధికార ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు జమిలి ఎన్నికలకు సిద్ధమని చెప్పడం నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది. మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం లేని వారు తెగ బాధపడిపోతున్నారు. చంద్రబాబు అలా అనకుండా ఉండాల్సిందని అనుకుంటున్నారు. ఈ పరిణామాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనందం కలిగిస్తున్నాయి. ఎన్నికలు వస్తే తాము అధికారంలోకి రావడం పక్కా అన్నది వారి భావన! భావన కాదు, ధీమాతో ఉన్నారు!