ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏం చేసినా వార్తే.. చివరికి భార్య కోసం చీర కొన్నా వార్తే! వార్త ఎందుకంటే ఆయన మొదటిసారి చీర కొన్నారట! ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(AP CM Nara Chandrabbau Naidu) ఏం చేసినా వార్తే.. చివరికి భార్య కోసం చీర కొన్నా వార్తే! వార్త ఎందుకంటే ఆయన మొదటిసారి చీర కొన్నారట! ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం కదా! ఈ సందర్భంగా చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ దగ్గరకు వెళ్లి చీరలు కొన్నారు. వెంకటగిరి, ఉప్పాడ, జాందాని చీరలను ముఖ్యమంత్రి తన సతీమణి భువనేశ్వరి(NaraBhuvaneshwari) కోసం కొన్నారు.

భార్య కోసం ఇన్నేళ్లుగా చంద్రబాబు చీర కొనలేదా? ఇదే మొదటిసారా? అని ఆశ్చర్యపోకండి.. చంద్రబాబు అలా చెప్పారు కానీ భువనేశ్వరి మాత్రం ఇంతకు ముందు ఓసారి కొనుక్కొచ్చారని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో చేనేత మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి ఈ విషయం చెప్పారు. అడక్క, అడక్క అడిగితే.. ఒక్కసారి చంద్రబాబు చీర కొని తెచ్చారట! అది ఎంత ఘోరంగా ఉందో చెప్పారు నారా భువనేశ్వరి. ఆ చీరను చూడగానే తనకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైందని అన్నారామె! ఆ కలర్‌ అలా ఉందట! ఇది జరిగి 30 ఏళ్లు అయ్యి ఉంటుందని, అంతగా గుర్తులేదని చెప్పారు. చీర ఎలా ఉన్నప్పటికీ మొదటిసారి మొగుడు తెచ్చిన చీర కాబట్టి బీరువాలో భద్రంగా దాచుకున్నానని, ఆయన ప్రేమతో తెచ్చిన చీర అదేనని భువనేశ్వరి అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story