Chandrababu : ప్రధానమంత్రికి లేఖ రాయడం కూడా నేరమేనట! చంద్రబాబు కొత్త థియరీ!
చంద్రబాబు కొత్త థియరీ!
తిరుమల లడ్డూపై(Tirumala laddu) వివాదాలు చెలరేగుతున్న వేళ అందులోని నిజానిజాలను నిర్ధారించి అసలు దోషులను పట్టుకోండి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి(PM narendra modi) వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ఓ లేఖ రాశారు. తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతు కొవ్వును అందులో వాడారని చంద్రబాబు అండ్ కో చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు కామెంట్‌తో దేశంలో గగ్గోలు మొదలయ్యింది. ఈ దెబ్బతో జగన్మోహన్‌రెడ్డి రాజకీయ జీవితం ఖతం అనే భావనతో తెలుగుదేశంపార్టీ(TDP) ఉంది. ఈ వివాదంలో జగన్‌ను ఇరికించడానికి టీడీపీతో పాటు కూటమిలోని ఇతర పక్షాలు, టీడీపీ అనుకూల మీడియా తెగ ఉత్సాహం చూపుతున్నాయి. చంద్రబాబు(Chandrababu) చేస్తున్న ఆరోపణలలో కొంచెం కూడా నిజం లేదని టీటీడీ ఈవో శ్యామలరావు మాటలతోనే అర్థమవుతోంది. అయినప్పటికీ జగన్‌కు చెడ్డపేరు తేవాలన్నదే టార్గెట్‌గా పెట్టుకున్న చంద్రబాబు బ్యాచ్ ఏదేదో చెబుతూపోతున్నారు. ఇదంతా ఎందుకని జగన్మోహన్ రెడ్డి తిరుమల వివాదంపై లోతుగా విచారణ జరిపించాలని ప్రధానమంత్రికి లేఖ రాశారు. తన మీద అకారణంగా నిందలు వేస్తున్న క్రమంలో భయపడకుడా లోతుగా దర్యాప్తు చేయండని చెబుతున్నారు. వైసీపీ తరఫున హైకోర్టులో కేసు కూడా వేశారు జగన్. ఇవన్నీ చంద్రబాబు బ్యాచ్‌కు నచ్చడం లేదు. చివరకి ప్రధానమంత్రికి లేఖ రాయడం కూడా సహించలేకపోతున్నారు. లేఖ రాయడం నేరమని చెబుతున్నారు. ఒకవేళ నరేంద్రమోదీ రియాక్టయ్యి కేంద్ర సంస్థలతో విచారణ జరిపిస్తే మొదటికే మోసం వస్తుందన్నది చంద్రబాబు భయం. తాము చేసిన, చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలని తేలిపోతుందన్న భయం చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్‌కు ఉన్నట్టుగా ఉంది. అందుకే జగన్ లేఖపై పెద్ద రాద్దాంతం చేస్తున్నారు.