తెలంగాణలో అంపశయ్య మీద ఉన్న తెలుగుదేశంపార్టీకి(TDP) తిరిగి జవసత్వాలు అందించడానికి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Chandrababu) ప్రయత్నాలు మొదలుపెట్టారు.

తెలంగాణలో అంపశయ్య మీద ఉన్న తెలుగుదేశంపార్టీకి(TDP) తిరిగి జవసత్వాలు అందించడానికి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Chandrababu) ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీకి అధ్యక్షుడంటూ ఎవరూ లేరు. కాసాని జ్ఞానేశ్వర్‌ వైదొలిన తర్వాత కొత్త వారిని నియమించలేదు. ఇప్పుడు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనుకుంటున్న నేపథ్యంలో ముందు అధ్యక్ష పదవిని తనవారికి కట్టబెట్టాలనుకుంటున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి(nandhamuri suhasini) ఆ బాధ్యతను అప్పటించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరోవైపు ఆమెను రాజ్యసభకు కూడా పంపించాలని అనుకుంటున్నారట! టీడీపీ నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ను దూరం పెట్టడానికే సుహాసినికి కీలక బాధ్యతలు అప్పగించగబోతున్నారనే టాక్‌ టీడీపీలో వినిపిస్తోంది. నందమూరి సుహాసిని ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి వస్తారంటూ గతంలో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట లేదంటే మరో నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేస్తారంటూ కథనాలు వచ్చాయి. అయితే అవి ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. లేటెస్ట్‌గా సుహాసినికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి బాబు సిద్ధమయ్యారట! ఉద్దేశపూర్వకంగానే నందమూరి హరికృష్ణను దూరం పెట్టిన చంద్రబాబు ఆ తర్వాత ఆయన కుమారులు ఎన్టీఆర్‌(NTR), కల్యాణ్‌రామ్‌లతో(Kalyan) కూడా అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వారి సోదరిని తనవైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీని వెనుక ఎన్టీఆర్‌ను సైడ్‌లైన్‌ చేయాలనే ప్లాన్‌ ఉందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story