Ysrcp Mayor Vs Tdp MLA : అనంతపురంలో వైసీపీ మేయర్ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే...!

అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం మరియు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ప్రజా సంఘ నాయకులు అనంతపురం నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారతీయ జనతా పార్టీ(BJP) రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్న నల్ల చట్టాలకు విరుద్ధంగా వక్ఫ్ ఆమెండ్ మెంట్ యాక్ట్ కు వ్యతిరేకనిరసన తెలిపి తదనంతరం ప్రెస్ మీట్ కార్యక్రమం కోసం దగ్గరలో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోకి వెళ్ళగా అక్కడ ఉన్న ఉద్యోగస్తులు మేయర్ మరియు ప్రముఖ నాయకులు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఇన్చార్జి కోసం చాలా సేపు వేచి చూచి ఎన్నిసార్లు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా వస్తున్న అన్నాడు చివరికి ఎమ్మెల్యే మీకు తాళం చెవులు ఇవ్వద్దు అంటున్నారు అని చెప్పాడు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే మేయర్ అనేటటువంటి వ్యక్తి నగర ప్రథమ పౌరుడు ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు ప్రథమ పౌరునికి ఒక ప్రోటోకాల్ అంటూ ఉంటుంది గౌరవించవలసిన పద్ధతి కూడా తెలియకుండా ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ లో పని చేస్తున్న వాళ్లకు హుకుం జారీ చేయడం చాలా విడ్డూరంగా ఉందని మేయర్‌ అనుచరులు విమర్శిస్తున్నారు. అంతేగాక MLA కు రాజకీయ అనుభవం లేమి ఏమో అనిపిస్తుంది. విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం కక్ష సాధింపు చర్యగా భావించవచ్చేమో అదేవిధంగా NDA కేంద్ర ప్రభుత్వం, ముస్లింల పట్ల క్రైస్తవుల పట్ల దళితుల పట్ల చేస్తున్న అణిచివేత కార్యక్రమాలను రాజ్యాంగపరమైన చట్టపరిదిలో చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రజలకు అండగా నిలవాల్సిన వ్యక్తి అది కాక దాదాపు 65 వేల మంది ముస్లింలు జనాభా ఉన్నటువంటి ముస్లింల సమస్యల చర్చించుకొనీ పత్రికా సమావేశం నిర్వహించుకునే దానికి అవకాశం ఇవ్వకుండా స్థానిక శాసనసభ్యులు ప్రవర్తించడం బాధాకరమైనటువంటి విషయమని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story