అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా కాలేదు. అప్పుడే కూటమి(Alliance)లో గొడవలు మొదలయ్యాయి.

అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా కాలేదు. అప్పుడే కూటమి(Alliance)లో గొడవలు మొదలయ్యాయి. గుడివాడ(Gudivada) కేంద్రంగా మొదలైన ఈ విభేదాలు ఎక్కడికి వెళతాయో తెలియదు. జెండా దిమ్మపై దాడి ఘటనతో అర్థరాత్రి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రావడంతో సరిపోయింది కానీ లేకపోతే తెలుగుదేశంపార్టీ(TDP), జనసేన పార్టీ(Janasena)కార్యకర్తలు కుమ్మేసుకునేవారు. అసలు ఏం జరిగిదంటే.. నాగవరప్పాడు(Nagarappadu)జంక్షన్‌లో జనసేన జెండా దిమ్మను టీడీపీ నేత ధారా నరసింహారావు(Dhara Narasimha Rao) ధ్వంసం చేయబోయారు. ఇది గమనించిన జనసేన కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. తెలుగుదేశంపార్టీ నేతలు కూటమి ధర్మం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. గుడివాడ తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము( MLA VENIGANDLA RAMU)వెంటనే స్పందించాలంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో తెలుగుదేశంపార్టీ వారు కూడా అక్కడికి వచ్చారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల వారు గట్టిగా వాదించుకున్నారు. ఒకరినొకరు తిట్టుకున్నారు. ఈలోగా పోలీసులు వచ్చారు. జనసేన కార్యకర్తలకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. జనసేన కార్యకర్తలు మాత్రం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. అది జెండా దిమ్మపై జరిగిన దాడిగా తాము చూడటం లేదని, తమపైనే దాడి జరిగినట్టుగా భావిస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan)దృష్టికి తీసుకెళతామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నరసింహారావుపై చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి గెంటేయాలని డిమాండ్‌ చేశారు. ఇది జరగకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే రామును హెచ్చరించారు. నరసింహరావుపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ehatv

ehatv

Next Story