ధర్మవరంలో టీడీపీ-బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ధర్మవరంలో టీడీపీ-బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి సత్యకుమార్ (Satya Kumar)సమక్షంలో బీజేపీ(BJP)లో చేరేందుకు మైనార్టీ నేత జమీన్ ప్రయత్నించగా.. జమీన్ చేరికను టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరాం (Paritala Sriram)తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే సోమవారం బీజేపీలో చేరికకు జమీర్ రంగం సిద్ధం చేసుకున్నారు. జమీన్‌ ఫ్లెక్సీలను పరిటాల వర్గీయులు చించివేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఫ్లెక్సీల తొలగింపుపై తొలుత వాగ్వాదం చెలరేగగా.. ఆ తర్వాత ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో రెండు స్కార్పియో కార్లతో పాటుగా మూడు బైకులు ధ్వంసమయ్యాయి.

ehatv

ehatv

Next Story