CID Request To Court : మరో 15 రోజులు రిమాండ్ పొడిగించండి... ఏసీబీ కోర్టుకు సీఐడీ అభ్యర్థన
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో(Skill Development Case) అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో(Rajahmundry Central Jail) ఉన్న తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రిమాండ్‌ను(Remand) మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ సీఐడీ(CID) ఆదివారం ఏసీబీ స్పెషల్ కోర్డులో(ACB Special Court) మెమో దాఖలు చేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో(Skill Development Case) అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో(Rajahmundry Central Jail) ఉన్న తెలుగుదేశంపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రిమాండ్‌ను(Remand) మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ సీఐడీ(CID) ఆదివారం ఏసీబీ స్పెషల్ కోర్డులో(ACB Special Court) మెమో దాఖలు చేసింది. తదుపరి దర్యాప్తు కోసం చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించాల్సిన ఆవశ్యకతను అందులో వివరించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఇంకా చాలా కీలక డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉందని తెలిపింది.
పలువురు సాక్షులను కూడా విచారించాల్సి ఉందని చెబుతూ ఈ కేసులో ప్రధాన సాక్షులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని దర్యాప్తు సంస్థలకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నారని మెమోలో పేర్కొంది. ఈ కేసుతో వారిద్దరికీ చాలా దగ్గర సంబంధం ఉందని తెలిపింది. పెడ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని పరారీ వెనుక చంద్రబాబునాయుడు ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని ఏసీబీ స్పెషల్ కోర్టుకు సీఐడీ విన్నవించుకుంది. దుర్వినియోగమైన నిధులు అంతిమంగా ఎక్కడకు వెళ్లాయి? షెల్ కంపెనీల ద్వారా నగదు రూపంలో ఎవరికి చేరాయి? అనే వివరాలు వీరిద్దరికీ తెలుసని సీఐడీ తన మెమోలో పేర్కొంది.
చంద్రబాబునాయుడును జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తూ అప్పుడు మాత్రమే ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్రను వివరించే సాక్షులకు రక్షణ ఉంటుందని సీఐడీ తెలిపింది. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ దర్యాప్తును పక్కదారి పట్టించేలా మీడియాలో మాట్లాడరని ఏసీబీ స్పెషల్ కోర్టుకు సీఐడీ నివేదిస్తూ, సాక్షులపై చంద్రబాబు, ఆయన మద్దతుదారులు ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారని తెలిపింది. ఈ కేసును డ్యామేజ్ చేయడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. సాక్షులను బెదిరించడం, భయపెట్టడం, ప్రభావితం చేస్తూ, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, దర్యాప్తులో జోక్యం చేసుకునే వీలు కూడా ఉందని సీఐడీ తన మెమోలో వివరించింది. దర్యాప్తు సంస్థకు, కోర్టుకు వాస్తవాలను తెలియనివ్వకుండా చేస్తున్నారని, వీటిని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు రిమాండ్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోర్టును సీఐడీ అభ్యర్థించింది.