అమరావతి అసైన్డ్ భూముల‌(Amaravati Assigned Lands) కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో(AP High Court) విచారణ జ‌రిగింది. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తికాగా.. నేడు తీర్పు ఇచ్చేందుకు కోర్టు సిద్ధమైంది. అయితే.. కొత్త ఆధారాలు ఉన్నాయని..

అమరావతి అసైన్డ్ భూముల‌(Amaravati Assigned Lands) కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో(AP High Court) విచారణ జ‌రిగింది. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తికాగా.. నేడు తీర్పు ఇచ్చేందుకు కోర్టు సిద్ధమైంది. అయితే.. కొత్త ఆధారాలు ఉన్నాయని.. వాటిని పరిగణనలోకి తీసుకోవాలని సీఐడీ కోర్టులో(CID Court) పిటిషన్ వేసింది. సీఐడీ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఈ మేర‌కు.. కోర్టుకు ఆడియో ఆధారాలు అందజేసిన సీఐడీ.. రేపు వీడియో ఆధారాలు కూడా అందజేస్తామని తెలిపింది.

కొత్త ఆధారాల నేపథ్యంలో కేసును రీ ఓపెన్‌ చేయాలని సీఐడీ మరో పిటిషన్ కూడా దాఖ‌లు చేసింది. సీఐడీ పిటిషన్లను విచారించిన కోర్టు.. కేసును రీ ఓపెన్‌ చేయడంపై ఏమైనా అభ్యంతరాలుంటే.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. అనంత‌రం త‌దుప‌రి విచారణను నవంబర్‌ 1వ తేదీకి వాయిదా వేసింది.

Updated On 16 Oct 2023 8:36 AM GMT
Ehatv

Ehatv

Next Story