CID Notices TO Ex-Minister P Narayana : మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో(Amaravati Inner Ring Road) టీడీపీ(TDP) నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు(Poguru Narayana) ఏపీ సీఐడీ నోటీసులు(AP CID Notices) పంపింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ విషయంలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలతో ఇప్పటికే టీడీపీ నేత నారా లోకేష్‌కు(Nara Lokesh) సీఐడీ నోటీసులు అందజేసింది.

CID Notices TO Ex-Minister P Narayana
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో(Amaravati Inner Ring Road) టీడీపీ(TDP) నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు(Poguru Narayana) ఏపీ సీఐడీ నోటీసులు(AP CID Notices) పంపింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ విషయంలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలతో ఇప్పటికే టీడీపీ నేత నారా లోకేష్‌కు(Nara Lokesh) సీఐడీ నోటీసులు అందజేసింది. ఈ కేసులో లోకేశ్ A14 కాగా.. ఏ2 నారాయణ. మొన్న ఢిల్లీ వెళ్లి లోకేష్‌కు నోటీసులు అందించిన సీఐడీ.. నేడు ఇదే కేసులో నారాయణకు కూడా నోటీసులు పంపింది. వాట్సాప్ ద్వారా నారాయణకు సీఐడీ నోటీసులు పంపింది. 4వ తేదీన ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నారా లోకేష్‌తో పాటు తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో వెల్లడించింది.
చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ పేరిట భారీగా అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Aalla Ramakrishna Reddy) సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా మాజీ మంత్రి నారాయణ పేర్లను సీఐడీ చేర్చింది. అయితే.. ఈ కేసులో ఇప్పటికే నారాయణ ముందస్తు బెయిల్‌పై ఉన్నారు.
