Chandrababu : ముగిసిన చంద్రబాబు సీఐడీ కస్టడీ
టీడీపీ అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగిసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబును సీఐడీ రెండురోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని విచారించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సీఐడీ(CID) కస్టడీ(Custody) ముగిసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబును సీఐడీ రెండురోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని విచారించింది. శని, ఆదివారాలలో చంద్రబాబును సీఐడీ 12 గంటలకు పైగా విచారించింది. విచారణలో 120 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. కొన్ని డాక్యుమెంట్స్ చూపించి నిధులు ఎటు వెళ్లాయని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇదిలావుంటే.. చంద్రబాబు అరెస్టుపై పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ఆదివారం ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అధినేత అరెస్టు తదనంతర పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్న, మద్దతుగా నిలిచిన వివిధ వర్గాలకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.