స్కిల్ స్కామ్‌లో అరెస్టై రాజమండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు శని, ఆదివారాల్లో విచారించనున్నారు. 9 మంది అధికారులు రెండు రోజుల పాటు ఆయ‌న‌ను విచారించ‌నున్నారు.

స్కిల్ స్కామ్‌(Skill Scam)లో అరెస్టై రాజమండ్రి సెంట్ర‌ల్ జైలు(Rajahmundry Central Jail)లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను సీఐడీ(CID) అధికారులు శని, ఆదివారాల్లో విచారించనున్నారు. 9 మంది అధికారులు రెండు రోజుల పాటు ఆయ‌న‌ను విచారించ‌నున్నారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జ‌రుగుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఓ ప్రత్యేక గదిలో జ‌రుగ‌నున్న‌ ఈ విచారణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలుస్తుంది.

కేసు విచారణాధికారి సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు(CID DSP Dhanunjayudu) నేతృత్వంలో చంద్ర‌బాబును విచారించ‌నున్నారు. విచారణకు చంద్రబాబు తరపు న్యాయవాదులను అనుమంచ‌నున్నారు. చంద్రబాబును విచారించనున్న తొమ్మిది మంది అధికారుల్లో.. ఎం ధనుంజయనాయుడు (సీఐడీ డిఎస్పీ), విజయ భాస్కర్ (సీఐడీ డిఎస్పీ), లక్ష్మీ నారాయణ (సీఐడీ డిఎస్పీ), ఇన్స్‌పెక్టర్లు మోహన్ కుమార్, రవి కుమార్, శ్రీనివాసన్, సాంబశివరావు, ఏఎస్ఐ రంగనాయకులు, పీసీ సత్యనారాయణ ఉన్నారు. వీరితో పాటు ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్, ఇద్దరు మీడియేటర్లు కూడా ఉంటారు.

శనివారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు చంద్రబాబును ప్ర‌శ్నిస్తారు. మధ్యలో ఓ గంట భోజనం విరామం ఉంటుంది. విచారణ జరిగే సమయంలో చంద్రబాబు, సీఐడీ తరపున న్యాయవాది ఉంటారు. డీఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో విచారణ ప్రక్రియ జరుగుతుంది. గంటకోసారి అయిదు నిమిషాల విరామం ఇచ్చి తన తరపున న్యాయవాదిని సంప్రదించుకునేందుకు చంద్రబాబుకు అవకాశం ఉంటుంది. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌(Video Grapher)తో మాత్రమే రికార్డు చేసి.. ఆ వీడియోను సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలని ధ‌ర్మాస‌నం ఆదేశించిన నేప‌థ్యంలో.. ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా అధికారులు క‌ట్టుదిట్ట‌మైన‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Updated On 22 Sep 2023 10:03 PM GMT
Yagnik

Yagnik

Next Story