రాజ్యసభకు చిరంజీవి..!

ప్రస్తుతం 4 రాజ్యసభ స్థానాలు రాష్ట్రపతి కోటాలో ఖాళీగా ఉన్నాయి. జూలై 14న ఖాళీ అయిన ఈ స్థానాలను జనవరి 14లోపు భర్తీ చేయాలి. అయితే ఇందులో ఒక స్థానానికి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) పెద్దల సభకు మరోసారి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటున్నా కానీ చిరంజీవిని పెద్దల సభకు పంపించే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌ (Pavan Kalyan) ఈ అంశంపై బీజేపీ పెద్దలతో చర్చించాలని అంతా ఓకే అయిపోయిందని అంటున్నారు. అందుకే నాగబాబును రాజ్యసభకు పంపే విషయంలో ఆలోచించారని.. రాష్ట్ర కేబినెట్‌కు పంపుతున్నారని చెప్తున్నారు. నాగబాబుకు (Nagababu) మంత్రి పదవి, చిరంజీవికి రాజ్యసభ ఇస్తే ఇక మెగా సోదరులు ముగ్గురు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొనసాగుతారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత చిరంజీవి కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన సమయంలో అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయినా రాష్ట్ర విభజన జరిగిపోవడంతో అప్పటి నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇకపై ఏ పార్టీలో చేరకూడదని చిరంజీవి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే పవన్‌ జోక్యంతో రాష్ట్రపతి కోటాలో చిరంజీవికి ఈ పదవి దక్కే అవకాశమైతే ఉంది.

ehatv

ehatv

Next Story