మెగాస్టార్‌ చిరంజీవి(Megastar Chiranjeevi) పలుచన అయ్యారు. కూటమికి(TDP Alliance) మద్దతు పలికి తన పరువు తీసుకున్నారు. కాంగ్రెస్‌(congress) పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీకి ఓటెయ్యమంటూ ప్రజలకు ఎలా విజ్ఞప్తి చేస్తారు? ఇది ఆయనకు తగని పని అని అభిమానులు కూడా వాపోతున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి(Megastar Chiranjeevi) పలుచన అయ్యారు. కూటమికి(TDP Alliance) మద్దతు పలికి తన పరువు తీసుకున్నారు. కాంగ్రెస్‌(congress) పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీకి ఓటెయ్యమంటూ ప్రజలకు ఎలా విజ్ఞప్తి చేస్తారు? ఇది ఆయనకు తగని పని అని అభిమానులు కూడా వాపోతున్నారు. ఎన్‌.టి.రామారావులా ముఖ్యమంత్రి కావాలనుకుని రాజకీయాల్లోకి వచ్చారు చిరంజీవి. సొంతంగా ప్రజారాజ్యం అనే పార్టీని పెట్టారు. ప్రజలకు సేవ చేయాలని ఉందన్నారు. ఎన్టీఆర్‌(NTR) తొమ్మిది నెలల్లో అధికారంలోకి వస్తే తాను అంత కంటే త్వరగా సీఎం కావాలనుకున్నారు. కానీ రాజకీయాలలో ఆయన అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారు. రెండు స్థానాల నుంచి పోటీ చేసిన ఆయన ఓ స్థానంలో పరాజయాన్ని కూడా మూటగట్టుకున్నారు. ఇక పార్టీని కాపాడుకోవడం కష్టమనుకున్నారు. పార్టీని నడిపించడం చేతకాక కాంగ్రెస్‌పార్టీలో విలీనం చేశారు.

అందుకు ప్రతిఫలంగా కేంద్ర మంత్రి పదవి పొందారు. మంత్రి పదవి కోసమే ఆయన పార్టీని విలీనం చేశారన్న టాక్‌ అప్పుడు వినిపించింది. ఎప్పుడైతే మంత్రి పదవిని చేపట్టారో అప్పుడే ఆయన పరువు సగానికి సగం పోయింది. ఆయన రాజ్యసభ పదవి పూర్తి అయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఏనాడు రాజకీయాలు మాట్లాడలేదు. కానీ ఆయన మనసు మాత్రం మోదీపైన ఉండేది. తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. మూస సినిమాల్లో నటిస్తున్నారు. కుర్ర హీరోయిన్లతో స్టెప్పులేస్తున్నారు. ఉన్నట్టుండి వాళ్లను గెలిపించండి.. వీళ్లను గెలిపించండి అంటూ వీడియోలు చేస్తున్నారు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఊరూరా తిరిగి ఓట్లు వేయండి అని వేడుకుంటేనే జనాలు లైట్‌ తీసుకున్నారు. ఇప్పుడు ఫలానా వారికి, ఫలానా పార్టీకి ఓటు వేయమని విన్నవించుకుంటే జనం మన్నిస్తారా? పార్టీని పెట్టినప్పుడు టీడీపీ అనుకూల మీడియా ఎన్నేసి ఆరోపణలు చేసిందో, ఎన్నేసి కథనాలను చిరుకు వ్యతిరేకంగా వండి వార్చిందో చిరంజీవి మర్చిపోయినా జనం ఇంకా మర్చిపోలేదు.

ఇప్పుడు మళ్లీ టీడీపీకి ఓటు వేయమని చిరంజీవి చెప్పడాన్ని ఏమనుకోవాలి? తాను రాజకీయలకు దూరంగా ఉంటున్నానని మొన్నటి వరకు చెబుతూ వచ్చిన చిరంజీవి ఇప్పుడు పాలిటిక్స్‌తో అంటకాగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అన్నట్టు 2004 ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ తెలుగుదేశంపార్టీ తరఫున పోటీ చేశాడు. అప్పుడు చిరంజీవి తెగ ప్రచారం చేశారు. అశ్వినీదత్‌ను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. టెలివిజన్‌ ఛానల్స్‌లో ప్రచారం చేశారు. ఏమైంది? అశ్వినీదత్‌ ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఫలానా పార్టీకి, ఫలానా వ్యక్తికి ఓటు వేయండి అంటూ చిరంజీవి ప్రచారం చేసినా అదే అవుతుంది. పొద్దున లేస్తే విలువల గురించి మాట్లాడే చిరంజీవి, కాంగ్రెస్‌లో ఉంటూ వ్యతిరేక పార్టీ అయిన ఎన్టీయే కూటమికి మద్దతు ఇవ్వడం ఏ విలువల కిందకు వస్తుందో చిరంజీవినే చెప్పాలి! అన్నదమ్ములిద్దరూ సరిపోయారు అని జనం అనుకుంటున్నారు.

Updated On 22 April 2024 2:55 AM GMT
Ehatv

Ehatv

Next Story