Chintha Mohan : 83 స్థానాలతో తెలంగాణలో కాంగ్రెస్ విజయ ఢంకా మోగిస్తుంది
విభజించి పాలించు అనే బ్రిటిష్ వారి కుట్ర రాజకీయాలను నేడు బీజేపీ కొనసాగిస్తున్నదని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు.
విభజించి పాలించు అనే బ్రిటిష్ వారి కుట్ర రాజకీయాలను నేడు బీజేపీ(BJP) కొనసాగిస్తున్నదని కాంగ్రెస్(Congress) మాజీ ఎంపీ చింతా మోహన్(Chintha Mohan) అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హ్యాండ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దినపత్రిక చేసిన సర్వేలో తెలంగాణ(Telangana)లో హస్తం పాలన రానున్నదని తేలింది. మైనార్టీల బలంతోనే జంట నగరాలలో సహా 83 స్థానాలతో కాంగ్రెస్ విజయ డంకా మోగిస్తుందన్నారు.
ఏపీలో మెడికల్ కాలేజీలలో సీట్లు అమ్మకానికే పరిమితమయ్యాయన్నారు. దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి ఏమి చేస్తుందని ప్రశ్నించారు. మాజీ దేశ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల విగ్రహాలను తిరుపతి(Tirupathi)లో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహాలు తుడా సర్కిల్, సిమ్స్ హాస్పిటల్ సర్కిల్, ఎస్వీయూ, ఆర్డీవో ఆఫీస్ ల వద్ద నాలుగు విగ్రహాలను ఏర్పాటు చేశారని.. వైసీపీ వచ్చాక వైయస్సార్ ను ప్రజలు ఎప్పుడో మర్చి పోయారన్నారు. 15 రోజులుగా ఉత్తరాఖండ్ లోని సిల్క్ యారా గ్రామంలో ఓ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రయాన్‌పై ఉన్న సంకల్పం సొరంగ కార్మికులను రక్షించడంలో ఏమైందని ప్రశ్నించారు.